మొక్కలు పెంచడం అనే అలవాటు మంచిదనే కాదు, అదృష్టం, ఆరోగ్యం, అవసరం కూడా. ఈ విషయం మనలో చాలా మందికి తెలుసు. అయితే ఏ మొక్క పెంచడం వలన ఎలాంటి అదృష్టం వస్తుందో తెలుసుకుందాం…
తులసి మొక్క;
తులసి మొక్క చాలా ముఖ్యమైనది. తులసి మొక్క అమ్మవారు స్వరూపం., పవిత్రమైనది. ఈ మొక్క పెంచడం వలన అదృష్టం తో పాటు ఆరోగ్యం కూడా. ప్రతిరోజు తులసి కోటకు పూజ చేసుకోవడం ఆ ఇంటి ఇల్లాలి భాగ్యమని అనుకోవాలి.
ఉసిరి మొక్క;
ఉసిరి మొక్కను సాక్షాత్తు విష్ణుమూర్తి అని అంటారు. ఆ స్వామి ఎక్కడ ఉంటె అక్కడ లక్ష్మి ఉంటుంది. లక్ష్మి ఉంటె కరువు అనేది ఉండదు. కార్తీక మాసంలో ఉసిరి మరియు తులసికి పూజ చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది.
కలకంద;
కలకంద మొక్క ఇంటి ముందు ఉండటం వలన దిష్టి దోషం పోతుంది. నర దిష్టి ఉంటె మనం ఎత్తుకు ఎదగలేము. అందుకే ఈ మొక్క మన ఇంటి ముందు ఉండటం వలన దిష్టి అనేదానిని మన దరికి రానివ్వదు.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ ఇంట్లో ఉండటం వలన ధనం పుష్కలంగా సమకూరుతుంది. దీని వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. పాజిటివ్ ఎనర్జీ రావడం వలన అన్ని పనులు పాజిటివ్ గా అయ్యి ఇల్లు ఇంట్లో వాళ్ళు శుభంగా ఉంటారు.
No comments:
Post a Comment