ఆటకుందో టైం పాటకుందో టైం అన్నట్లే రొమాన్స్ కూడా టైం ఉంది.ఇంతకూ..!
శృంగారానికి సరైన వయసు ఏది? ఏ వయసులో శృంగారం ఆసక్తికరంగా ఉంటుంది.
దీనికి చాలామంది అనుకునే సమాధానం యుక్త వయసు అని. అంటే 20 సంవత్సరాల నుంచి
30 వరకు. కానీ అది అబద్ధమని ఇటీవల జరిగిన సర్వేలో తేలింది.
శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేయడానికి 40 సంవత్సరాల వయసే సరైనదట! నిజానికి ఆ వయసులోనే చాలామంది దంపతులు సెక్స్‌లోని అసలైన మజాను చవిచూశారట. ఇటీవల బ్రిటన్‌లో వృద్ధులపై జరిగిన సర్వేలో ఇది రుజువైందట. ఈ సర్వేలో పురుషులు, మహిళలు కలిపి మొత్తం 828 మంది పాల్గొన్నారు. వారిలో 38 శాతం మహిళలు, 39 శాతం పురుషులు.. సెక్స్‌ను 40 సంవత్సరాల వయసులోనే బాగా ఎంజాయ్ చేశామని చెప్పారట.
దీనికి కారణం లేకపోలేదు. శృంగారం రెండు శరీరాల మధ్య జరిగేదే అయినా ..
అందులో మనసు పాత్ర కూడా చాలా కీలకం. సాధారణంగా యుక్త వయసులో ఉండే ఒత్తిడి,
టెన్షన్ నాలుగు దశాబ్దాల వయసులో ఉండవట. అందుకే ఆ వయసులో మనసును పూర్తిగా
సెక్స్‌పై కేంద్రీకరించవచ్చట.
‘ఇరవై సంవత్సరాల వయసులో ఎక్కువసార్లు సెక్స్ చేయగలగుతాం. కానీ అందులో మొక్కుబడితనం, ఆత్రుతే ఎక్కువగా ఉంటుంది. ముప్పై సంవత్సరాల వయసులో పిల్లలు చిన్న వాళ్లుగా ఉంటారు. ఆ సమయంలో వారి గురించి శ్రద్ధ తీసుకోవాలి. కెరీర్ మీద దృష్టి పెట్టాలి. అదే నలభయ్యేళ్లు వచ్చే సరికి పిల్లలు కొంచెం పెద్దవారై ఉంటారు. కెరీర్‌లో కూడా స్థిరపడిపోతాం. కాబట్టి ఆ వయసులో మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి సెక్స్‌ను ఎంజాయ్ చేయడానికి అదే సరైన వయసు’అని పరిశోధకుడు తెలిపారు.
share this