Tuesday, 30 August 2016

చిన్న టిప్‌తో లైంగీక సామ‌ర్థ్యం సూప‌ర్‌ Super-small tip to laingika

మాన‌వ‌జీవితంలో ప్ర‌తి ఒక్క పురుషుడికి లైంగీక సామ‌ర్థ్యం చాలా ముఖ్యం. లైంగీక జీవ‌నంలో సంతృప్తి లేకుంటే జీవితంలో చాలా స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ లైంగీక సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు ప‌రిశోధ‌కులు చిన్న టిప్స్ చెపుతున్నారు. ఈ టిప్స్ వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది.
మితాహారం తిన‌డం వల్ల మూడ్ బాగుంటుందని,




టెన్షన్ తగ్గుతుందని, ఫలితంగా సంసార జీవితం చాలా బాగుంటుందని చెబుతున్నారు. ఇందుకోసం 218 మంది ఆరోగ్యవంతమైన వ్యక్తుల ఆహారపు అలవాట్లను రెండేళ్ల పాటు లూసియానాలోని పెన్నింగ్టన్ బయోమెడికల్ రీసెర్చ్ సెంటర్ వాళ్లు పరిశీలించారు. వాళ్లను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూపు వాళ్లకు భోజనాన్ని క్రమంగా 25 శాతం తగ్గించారు. మరో గ్రూపు వాళ్లకు మాత్రం మామూలు భోజనమే పెట్టించారు.
వాళ్లలో భోజనం తక్కువగా తీసుకున్నవాళ్లు తమ సంసార జీవితాన్ని అంతకుముందు కంటే బాగా ఆస్వాదించినట్లు చెప్పారు. మిగిలినవాళ్లు మాత్రం మామూలుగానే ఉన్నారు. భోజనాలు తగ్గించినవాళ్లకు బరువు కూడా తగ్గి నిద్ర బాగా పట్టినట్లు తెలిపారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల నిద్ర సరిగా పట్టదని, దాంతో సంసార జీవితంపై కూడా దాని ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెప్పారు.


share this

No comments:

Post a Comment