స్త్రీ పురుషుల జీవితంలో వివాహం అతిమధురైన ఘట్టం అనడంలో ఎటువంటి
సందేహం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ముఖ్యమే.. అయితే ఫస్ట్ నైట్
(శోభనం రాత్రి) అత్యంత కీలకమైన
ఘట్టమే..
వివాహానికి ముందు అపరిచితులుగా ఉన్న స్త్రీ, పురుషులు భార్యాభర్తల బంధం
పేరిట శారీరకంగా కలుసుకునే శుభరాత్రి. ఆ రాత్రి వధువు పాల గ్లాసుతో
వస్తే.. వరుడు దాన్ని స్వీకరించి, ఆ తరువాత ఇద్దరూ కలిసి తాగి.. తమ
పనిలో నిమగ్నమైపోతారు. అయితే, తొలి రాత్రి కేవలం పాల గ్లాసునే ఎందుకు
ఎంచుకుంటారన్న అంశంపై ఇప్పుడు తెలుసుకుందాం.
స్త్రీ పురుషులు భార్యాభర్తల బంధం పేరిట మొదటిరాత్రి, తొలిసారి
ఏకాంతంగా కలిసినప్పుడు ఎంత మేనేజ్ చేసినా వారిలో అంతర్గతంగా
భయాందోళనలు ప్రభావితం చూపిస్తాయి. వీటి నియంత్రణకు పాలు ఎంతగానో
దోహదం చేస్తాయి. పైగా పాలు త్వరగా జీర్ణం అవుతాయి. పుష్కలమైన
న్యూట్రిషన్ ఫుడ్, పాలు తాగడం వల్ల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి.
దీని వల్ల వారిలో ఆందోళన సర్దుకుని, హ్యాపీనెస్ వస్తుందని
పరిశోధకులు తేల్చారు. అంతేకాకుండా పాలల్లో ఉండే ప్రోటీన్స్ వల్ల రక్త
ప్రసరణ బాగా జరుగుతుందట, మగవారికి సెక్స్‌లో అవసరమైన హార్మోన్లు
భారీగా విడుదలై దంపతుల మొదటిరాత్రి జీవితం మరింత మధురమైన,
మరపురాని రాత్రిగా మిగిలిపోవడానిని పాలు దోహదం చేస్తాయని వారు
చెబుతున్నారు.
భారతీయ సంప్రదాయంలో తొలిరాత్రిన వధువు చేతికి పాల గ్లాసు ఇవ్వడానికి
మరో కారణం కూడా ఉందట. ప్రపంచంలో అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే
మనదేశంలో పాలను పంచామృతాలలో ఒకటి భావించడం, దంపతులు మొదటి రాత్రి
కలసి పాలు పంచుకుంటే జీవితం శుభకరంగా ఉంటుందనే సంప్రదాయం విశ్వాసంగా
ఉంది.
share this
No comments:
Post a Comment