Monday, 22 August 2016

ఆమెకు ఏడుగురు మొగుళ్లుHer seven husbands

బెంగ‌ళూరులో ఇమ్రాన్ అనే ఓ భ‌ర్త త‌న భార్య‌కు తాను కాకుండా మ‌రో ఏడుగురు భ‌ర్త‌లున్నార‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన సంఘ‌ట‌న చోటుచేసుకుంది. త‌న భార్య‌కు ఏడుగురు మొగుళ్లు అని ఫిర్యాదు చేయ‌డంతో చాలా ఆశ్చ‌ర్యంగా ఉన్నా… విష‌యం బ‌య‌ట‌ప‌డేస‌రికి ఒక్కొక్క‌రు ఆమెను పెళ్లి చేసుకుని వేధింపుల‌కు గుర‌యిన వారు క్యూ క‌డుతున్నార‌ట‌. అనేక మంది మ‌హిళ‌లు మా భ‌ర్త‌కు ఇద్ద‌రు పెళ్లాలు, ముగ్గురు పెళ్లాలు అని చెప్పుకునే వారినే చూశాం. త‌న భార్య ప్ర‌తిరోజు కొడుతుంద‌ని, ఏడుగురు భ‌ర్త‌లున్నార‌ని చెప్పుకుని ఆ భ‌ర్త బాధ‌ప‌డుతుండ‌డంతో చాలా మంది అవాక్క‌వుతున్నారు.






త‌న భార్య‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన ఆ బాధిత భ‌ర్త మాట్లాడుతూ త‌న భార్య ఏడుగురిని పెళ్లి చేసుకోవడం ద్వారా తనను మోసం చేయడమే కాకుండా, ప్ర‌తిరోజు త‌న‌ను కొడుతోందని త‌న దీన గాథ‌ను మొత్తం చెప్పి ఆమె భారి నుంచి తనను కాపాడి న్యాయం చేయాలంటూ పోలీసుల‌ను వేడుకున్నాడు.
తూర్పు బెంగళూరు నగరంలోని కేజీహళ్లీకి చెందిన తన భార్య యాస్మిన్ బాను (38) తనపై దాడి చేసి కొట్టిందని ఇమ్రాన్ అనే వ్యక్తి కేజీహళ్లీ పోలీసులకు ఫిర్యాదుచేశారు. తనపై దాడి చేయడమే కాకుండా తన భార్య ఏడుగురిని పెళ్లాడి తనను మోసం చేసిందని ఇమ్రాన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇమ్రాన్ ఫిర్యాదుపై పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు.






ఈ కేసులో తాము యాస్మీన్ ను పెళ్లాడామని అఫ్జల్, షోయబ్ లనే మరో ఇద్దరు పోలీసుల వద్దకు వ‌చ్చి స్ప‌ష్టం చేశారు. పెళ్లాడాక పెద్దమొత్తంలో డబ్బు ఇవ్వాలని యాస్మీన్ అడగ్గా తాను డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో తనను వదిలి వెళ్లిందని రియల్ ఎస్టేట్ ఏజెంటు అయిన అఫ్జల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మొత్తంమీద ఓ మహిళ ఏడుగురిని పెళ్లాడిందని వచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు ఈ కేసు దర్యాప్తు సవాలుగా మారింద‌నే చెప్పాలి.



share this

No comments:

Post a Comment