Sunday, 28 August 2016

న‌యా ట్రెండ్‌: న‌గ్న యోగాNeo Trend: naked yoga

భారత ప్రధానిగా నరేంద్రమోడీ వ‌చ్చాక యోగా బాగా పాపుల‌ర్ అయ్యింది. ఇక ఈ మోడ్ర‌న్ ప్ర‌పంచంలో యోగా గురించి తెలియ‌ని వారుండ‌రు. అయితే ఇప్పుడు ఈ యోగా పాశ్చాత్య దేశాల్లో వెర్రి పుంతలు తొక్కుతోంది. నిన్న‌టి వ‌ర‌కు యోగా అంటే ప్ర‌శాంతంగా..ఏకాంతంగా చేసుకోవ‌డం..త‌ర్వాత అది ట్రెండ్ మార్చుకుని ఎక్కువ మందికి విస్త‌రించింది.





 అయితే ఈ యోగా ప్ర‌స్తుతం రూటు మార్చుకుని న‌గ్న యోగా అనే కొత్త కాన్సెఫ్ట్‌తో వ‌చ్చేసింది.
నగ్న యోగా పేరుతో కాల్గెరీలో ఓ టీచరమ్మ కోఎడ్యుకేషన్ క్లాసులు నిర్వహిస్తోంది. మొదట్లో అంతగా ఆసక్తి చూపని జనాలు ఇప్పుడు ఈ యోగా కోసం క్యూలు కడుతున్నారు. కాల్గెరీకి చెందిన కేథరిన్ మెడీనా కో-ఎడ్ నేక్‌డ్ యోగా పేరుతో క్లాసులు మొదలుపెట్టింది. మొదట్లో ఇద్దరు నగ్న విద్యార్థులతో మొదలైన ఈ యోగా క్లాసులో ఇప్పుడు ఒక్కో క్లాసులోనే 20 నుంచి 30 మంది వరకు ఉంటున్నారు. గత వారం మరో 300 మంది చేరారు. వారం వారం ఈ నగ్నయోగా క్లాసులో చేరేవారు ఎక్కువైపోతున్నారంటూ మెడీనా ఆనందం వ్యక్తం చేసింది. వారానికి ఇద్దరు ముగ్గురు చొప్పున జాయిన్ అవుతున్నారంటూ చెప్పుకొచ్చింది.
ఈ యోగా అంద‌రికి అనువైనది కాదని, నిజమైన యోగా అనుభవం కోరుకునేవారికి ఇది సరిపోదని మెడీనా తెలిపింది. నగ్నంగా ఒకరినొకరు చూసుకుంటూ, టచ్ చేసుకుంటూ, ఒకరికొకరు ఆలంబనగా నిలుస్తూ.. క్లాసులు ఇలా సాగుతాయంట. ఇదేమంత సీరియస్ యోగా కాదని, అంతా సరదాగా సాగుతుందని తెలిపింది.







అందరూ నగ్నంగా ఉన్నప్పటికీ శృంగారానికి అతీతంగా క్లాసులు సాగుతాయంటూ సెలవిచ్చింది. అంతేకాదు వేలైంటన్స్ డే సందర్భంగా జంటల కోసం ప్రత్యేకంగా నగ్న యోగా క్లాసులు నిర్వహిస్తున్నట్టు వివరించింది. నగ్న యోగా వల్ల ఒకరినొకరు అర్థం చేసుకునే వీలుంటుందని, జీవితాంతం కలిసి జీవించగలుగుతారని మెడీనా తెలిపింది. ‘‘నా యోగా క్లాసులు శృంగారానికి సంబంధించినవి కావు. ఒకరికొకరు తోడు నిలవడం కోసమే’’ అని మెడీనా వివరించింది. మోడీనా చెప్పింది నిజ‌మేనా అని న‌మ్మాల్సిందేనా..!



share this

No comments:

Post a Comment