Saturday, 13 August 2016

గుండె జబ్బులను తగ్గించే కొబ్బరి నీళ్ళు..!Coconut water is preventing cardiovascular disease

గుండె జబ్బులను తగ్గించే కొబ్బరి నీళ్ళు..!
కొబ్బరి నీళ్ళలో దివ్య ఔషధాలు ఉన్నాయి. దాహం తీర్చడమే కాకుండా, ఇందులో ఉండే మినరల్స్ శరీరానికి మేలు చేస్తాయి. అంతేగాకుండా కొబ్బరి నీళ్లలో శరీరానికి కావలసిన రోగనిరోధక శక్తి పుష్కలంగా దొరుకుతుంది. కొబ్బరి నీళ్ళు సేవించడం వల్ల అనేక రోగాలు మన దరికిచేరవు. వాతం, పిత్తం గుణాలను పూర్తిగా హరిస్తుంది.
వేడిని తగ్గిస్తాయి. విరేచనాలను అరికడుతుంది. గుండె జబ్బులను తగ్గిస్తాయి. అన్నింటికంటే శక్తిని, బలాన్నిచేకూరుస్తాయి. అందుచేత రోజూవారీగా ఓ కొబ్బరి బొండాంలోని నీరు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అలాగే కొబ్బరి నీళ్లను తాగడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరగడంతో వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.



No comments:

Post a Comment