Monday, 22 August 2016

ఆ దేశంలో సెక్స్‌పైనే టీనేజ‌ర్ల ఆస‌క్తిIn the interest of teenagers who sekspaine

సాధ్యం కానిదాన్ని సుసాధ్యం చేసే శక్తి టీనేజర్ల సొంతం. వారి ఆసక్తులు ఎంటి ? ఎలా ఉన్నాయి ? అనే అంశంపై ఐర్లాండ్ దేశంలో టీనేజర్ల ఫోకస్ దేనిమీద ఉందో తెలుసుకోవటానికి 18 ఏళ్ల వయసు లోపు పిల్లల అలవాట్లపై ఇటీవల ఒక సర్వే నిర్వహించారు.




ఈ సందర్భంగా వెల్లడైన ఫలితాలు చూసిన వారు షాక్ తిన్నార‌ట‌. వారు పేరుకు పిల్లలే కానీ.. వారి ఫోకస్ అంతా సెక్స్ మీదేన‌ట‌.. అదే సమయంలో తాగుడు.. సిగిరెట్ లాంటి వాటికి దూరంగా ఉండటం గమనార్హం. దాదాపు 230కి పైగా స్కూళ్లల్లో నిర్వహించిన ఈ సర్వేలో బయటపడిన అంశాలు పలువురిని ముక్కు మీద వేలు వేసుకునేలా చేశాయి.
సర్వేలో పాల్గొన్న విద్యార్థుల్లో ఎక్కువమందికి ఇప్పటికే సెక్స్ అనుభవాలు ఉన్నట్లుగా తేలింది. అయితే.. సంపన్న వర్గాల పిల్లలతో పోలిస్తే.. పేద.. మధ్యతరగతి విద్యార్థులలో సెక్స్ మీద ఆసక్తి ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. వీళ్లు ఎంతలా ముదిరిపోయారంటే.. సెక్స్ చేసే సమయంలో కండోమ్ లు.. గర్భం రాకుండా పిల్స్ వినియోగించటంలో చాలా జాగ్రత్తలు తీసుకోవటం.. ఆ అవగాహన కూడా వీరికి చాలా ఎక్కువగా ఉన్నట్లు స‌ర్వేలో గుర్తించారు.






15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారిలో 27 శాతం మంది తమకు సెక్స్ అనుభవం ఉన్నట్లుగా చెప్పేశారు. కొంద‌రైతే 12 ఏళ్ల‌కే సెక్స్ అనుభ‌వం రుచి చూశార‌ట‌. ఇది గతంతో పోలిస్తే 3 నుంచి 5 శాతం ఎక్కువని చెబుతున్నారు. సెక్స్ మీద ఆసక్తి పెరగటం… డైటింగ్ మీద జాగ్రత్తలు తీసుకోవటం.. నాన్ వెజ్ కంటే వెజ్ ఇష్ట‌ప‌డే వారి సంఖ్య కూడా పెరిగినట్లు గుర్తించారు. ఒక్క సెక్స్ యావ తప్ప మిగిలిన అంశాల్లో వేలెత్తి చూపించలేని విధంగా ఉన్న ఐర్లాండ్ టీనేజర్ల‌కు ఉన్న సెక్స్ యావ ఇప్పుడా దేశ పెద్దల్లో ఆందోళనకు గురి చేస్తోంది.



share this

No comments:

Post a Comment