శృంగారం లేని జీవితాన్ని ఊహించగలమా..? అసలు శృంగారమే లేకుండా మనిషి జీవించలేడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు
ఒక్కొక్కరి నుంచి ఒక్కోలా వ్యక్తమవుతాయ్! ఆయుర్వేదం మాత్రం మనిషి
శరీరం, మనసు, ఆత్మ వీటన్నింటి సమ్మిశ్రమంగా భావించి మనిషికి చికిత్స
అందించాలని చెబుతోంది.అదేవిధంగా సెక్సాలజీ కూడా మనిషిని పూర్తిగా, అన్ని
దృక్కోణాల నుంచి పరిశీలించాలని బోధిస్తోంది.
మనిషి, శరీరం, హార్మోనులు,
పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాయిష్టాలు,
ఆశయాలు వీటన్నింటిని పరిగణించాలని సూచిస్తోంది.
శృంగారంలో పాల్గోవాలంటే భాగస్వామి ఇష్టాలు తెలుసుకోవడం.. వాటికి తగినంత
ప్రాధాన్యం ఇవ్వడం ఎంతైనా అవసరం.తమకిష్టమైనవి, లేనివి స్త్రీ
చెప్పకపోవచ్చు.అదేవిధంగా శృంగారంలో ఉన్నప్పుడు ఎక్కడ చేయి వేస్తే తీసి
వేస్తున్నారు.. ఎక్కడ చేయి ఉంచుతున్నారు.. ఇలాంటివి కూడు పురుషుడు పరిశీలన
ద్వారా తెలుసుకోవాలి.
సుఖ వ్యాధులకు దూరంగా ఉండండి
పెళ్ళికి ముందు తర్వాత వేశ్యలతో తిరిగేవారు సుఖ వ్యాధుల బారిన పడకుండా
తగు జాగ్రత్తలు తీసుకుని, భార్యతో శృంగారంలో పాల్గొనాలి. సాధ్యమైనంత
వరకూ వివాహానంతరం వేశ్యాసంభోగం మానివేస్తే మంచిది. గర్భం
వద్దనుకున్నప్పుడు నిరోధక పద్ధతులు గురించి ముందుగా తెలుసుకోవాలి.
లేకుంటే గర్భం వస్తుందేమోనన్నభయం పాతుకుపోతే ఇద్దరూ శృంగారాన్ని తగిన
రీతిలో ఆస్వాదించలేరు. సెక్స్‌లో ఎలా తృప్తి పొందాలి? వీర్యస్ఖలనాన్ని
నియంత్రించుకోవాడం ఎలా? భావప్రాప్తి పొందడం ఎలా? అన్న ప్రశ్నలకు
సమాధానాలను మగడు తనంతట తానే తెలుసుకోవాలి.అదేవిధంగా ఏవి
కామోద్రేకాన్ని కలిగిస్తాయి.. ఏవి ఉద్దీపన శక్తిగా పనిచేస్తాయి..
అన్నవి కూడా.. క్రమక్రమంగా అనుభవపూర్వకంగా అవగతం చేసుకోవాలి.
పరిశుభ్రత ముఖ్యం
శృంగారం విషయంలో పరిశుభ్రత పాటించాలి. ఆత్మవిశ్వాసం ప్రదర్శించాలి.
ఫోర్‌ప్లే అన్నది స్త్రీ పురుషునికి కూడా చేయగలగాలి.ఒంట్లో
బాగుండనపుడు, మానసికంగా ఆందోళనలతో..ఉన్నప్పుడు, సవాలక్ష ఒత్తిళ్లతో
సతమతమవుతున్నప్పుడు స్త్రీ – పురుషులిద్దరూ సెక్స్‌లో
ఆసక్తిదాయకంగా పాల్గొనకపోవచ్చు. అటువంటప్పుడు జీవిత భాగస్వామిపై
ప్రేమానురాగాలు చూపడంద్వారా ఆరోగ్యం తొందరగా కోలుకోవడం జరుగుతుంది.శారీరకం
గా, మానసికంగా బాగా అలసిపోయిన రోజు సెక్స్‌లో పాల్గొనకుండా.. ఆ రాత్రి
విశ్రాంతి తీసుకుని వీలైతే తెల్లవారుజామున కలయికలో పాల్గొంటే మంచిది.
share this
No comments:
Post a Comment