స్ర్తీ, పురుషుల్లో ఈ వైరస్ ఏ ఒక్కరిలో ఉన్నా ముద్దు పెట్టుకునే సమయంలో లాలాజలం ద్వారా ఎదుటివారిలోకి ప్రవేశి స్తుంది. తద్వారా వారికి కూడా పైన పేర్కొన్న క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉందని అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధన వెల్లడించింది. ఫ్రెంచ్ కిస్ వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికాలో అయితే తల, మెడ క్యాన్సర్లు వస్తున్న వారిలో 10 శాతం మందికి హెచ్‌పీవీ వల్లనే వస్తున్నట్టు తేలింది.
కేవలం ముద్దు ద్వారా క్యాన్సర్ తెచ్చుకుంటున్న వారి సంఖ్య ఆస్ట్రేలియాలోనే అధికంగా ఉంది. అందుకే ఇప్పుడు ఆస్ర్టేలియాలో పిల్లలకు 13 ఏళ్ల వయస్సు వచ్చే సరికే హెచ్‌పీవీ వాక్సినేషన్‌ను తప్పని సరిగా ఇస్తున్నారు.
ముద్దులో 278 క్రిములుంటాయ్!
ఏదైనా సరే మితంగా ఉంటే మేలు అతిగా ఉంటే అనర్థదాయకం అన్నారు పెద్దలు. అందుకని హద్దుల్లో ఉంటూ ముద్దులు పెడితే తప్పులేదు. ముద్దు పెట్టుకునేటప్పుడు సుమారు 278 రకాల సూక్ష్మ క్రిములు ఒకరి నోటి నుంచి మరొకరి నోటిలోకి వెళ్లే ప్రమాదమూ ఉంది. అయితే ఈ సూక్ష్మ క్రిములన్నీ హానికరమైనవే అని చెప్పలేం. వాటిల్లో కొన్ని మంచివి కూడా ఉండొచ్చు. ఏది ఏమైనా, అధర చుంబనం సమయంలో నోటి పరిశుభ్రత చాలా ముఖ్యం.
No comments:
Post a Comment