Monday, 22 August 2016

భార్య‌కు మందు ప‌ట్టించి..ఫ్రెండ్స్ వ‌ద్ద‌కు… what is the family problems? ...

మహారాష్ట్రలోని పుణె జిల్లా హదాప్సర్ కు చెందిన ఓ వ్యక్తి భార్య పట్ల దారుణంగా ప్రవర్తించాడు. 40 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఆ మృగాడైన భ‌ర్త‌ను అదుపులోకి తీసుకున్నారు. చెడు స్నేహాల‌కు అల‌వాటు ప‌డ్డ ఆ భ‌ర్త త‌న భార్య‌కు బ‌ల‌వంతంగా మ‌ద్యం తాగించేవాడు. ఆ తర్వాత తన స్నేహితులతో గడపాల్సిందిగా ఆమెను బలవంతం చేసేవాడు.
అతని డిమాండ్లకు ఒప్పుకోకపోతే భార్యను సిగరెట్ పీకలతో కాల్చి చిత్రహింసలు పెట్టేవాడు. మ‌రో దారుణ విష‌యం ఏంటంటే ఆ భ‌ర్త చేసే ప‌ని త‌ప్పు అని చెప్పాల్సిన భ‌ర్త కుటుంబ‌స‌భ్యులు సైతం అత‌డిని మందలించకుండా వంతపాడేవారు. ఆమెను దూషిస్తూ వేధించేవారు.




భర్త ఆగడాలతో విసిగిపోయిన భార్య చివరకు పోలీసులను ఆశ్రయించింది. వనోవ్రీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి భర్త, అతని తల్లి, తమ్ముడు, సోదరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా నిందితులను ఇంకా అరెస్ట్ చేయాల్సివుంది.

No comments:

Post a Comment