Tuesday, 30 August 2016

మ‌గాళ్ల చూపుల్లోనే కోరిక‌లు తెలుస్తాయా..?Magalla cupullone wishes knows ..

ఆడువారి మాట‌ల‌కు అర్ధాలు వేరులే’ అనే పాట‌ను మనం విన్నాం.. కాని మ‌గ‌వారి కంటి చూపుల్లో వారి కోరిక‌లు ఏమిటో ఈజీగా చెప్పేస్తార‌ట మ‌హిళ‌లు. ఈ విషయం తాజాగా ఒక అధ్యనంలో వెల్లడైందని సైకాలజిస్టులు చెపుతున్నారు. అమెరికాకు చెందిన పరిశోధకులు ఒక గ్రూపు లోని యువకులపై అధ్యయనం జరిపారు. మహిళల గురించి మగాళ్ల ఇంటెన్షన్స్ ఎలా ఉంటాయనే విషయంపై యువకుల నుంచి అభిప్రాయాలు సేకరించారు. ముందుగా యువకులకు కొందరు మహిళల చిత్రాలను చూపించారు.అయితే ఈ ఫొటోలపై ప్రీ కవర్డ్ పేపర్ ను అతికించారు. దీంతో యువకులు ఫొటోలోని ఒకానొక పార్ట్ ను ఓపెన్ చేయాలని సూచించారు. అయితే ఈ పరిశోధనలో పాలుపంచుకున్న సగం మంది యువకులు ఫ్లిర్టింగ్ తర్వాత రిలేషన్ షిప్ ను కొనసాగించేందుకు ఇష్టపడ లేదు.
యువ‌కుల్లో ఎక్కువ మంది అమ్మాయిల ఫిగర్ ను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అయితే మిగతా వారు మాత్రం ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రారంభించడానికి సిద్ధపడ్డారు. అయితే వీరు యువతుల ఫేస్ ఎలా ఉందో అని చూశారు. ఒక యువకుడు అమ్మాయిని మీట్ అయిన తర్వాత అతను ఆమె శరీరాన్ని వర్ణించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాడని సైకాలజిస్టులు గుర్తించారు. వారు టెంపరరీ రిలేషన్షిప్ కోసమే ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. అందువల్ల మహిళలు మగవారి ఫేస్ లోకి చూసినట్లయితే వారి ఆలోచనలు సులువుగా చదివేయడానికి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కాబ‌ట్టి మ‌గ‌వాళ్లు మ‌హిళ‌ల ప‌ట్ల జాగ్ర‌త్త వ‌హించాల‌ని ఈ స‌ర్వే ద్వారా అర్థ‌మ‌వుతోంది.

No comments:

Post a Comment