అత్యాచార ఘటన ఆదివారం తెల్లవారుఝామున జరుగగా, సాయంత్రానికి అందరినీ అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంతో చేసిన పనికి జైలు ఊచలు లెక్కబెడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోలోని ఇందిరానగర్ ప్రాంతంలో ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నడుపుతున్న 25 ఏళ్ల యువతి, డ్యాన్సర్ గా పనిచేస్తోంది. ఆమె వద్దకు సత్యవీర్ సింగ్ అనే వ్యక్తి వెళ్లి, హోటల్ పార్టీలో నృత్యం చేయాలని చెప్పాడు. దీంతో తనతో పాటు మరో ఇద్దరు యువతులను వెంట బెట్టుకుని ఆమె వెళ్లింది.
అనంతరం వారి బారి నుంచి ఎలాగోలా బయటపడి బంతారా పోలీసు స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా, వెంటనే స్పందించిన పోలీసులు, నిందితుల ఫోన్ నంబర్లను ట్రేస్ చేసి సాయంత్రానికి అరెస్ట్ చేశారు. లైసెన్స్ లేకపోయినా డ్యాన్స్ పార్టీకి అనుమతించిన హోటల్ మేనేజర్ నూ కటకటాల్లోకి పంపారు. అరెస్టయిన నలుగురూ ఆ సంస్థలో మేనేజర్ స్థాయి అధికారులని పోలీసులు వెల్లడించారు.
share this
No comments:
Post a Comment