దాంపత్య సుఖమయ జీవితం మరింత శృంగార భరితం కావాలంటే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే మరింత శృంగారాన్ని సొంతం చేసుకోవచ్చు. రోజువారీ దిన చర్యల్లో భాగంగా కనీసం రోజుకు 6 గంటలు నిద్రపోవాలి. రోజుకు ఓ గంట వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. అలాగే యోగా కచ్చితంగా చేయాలి. సెక్సువల్ ఫిట్‌నెస్‌కు యోగాకు మధ్య సంబంధం ఉందని, సెక్స్ కు సంబంధించిన సమస్యలను యోగానుంచి పరిష్కరించుకోవచ్చని యోగా గురువులు సూచిస్తున్నారు. మనం కూడా వాటిపై ఓ లుక్కేద్దాం…
* యోగా అంటేనే జోడించడం, కలపడం అని అర్థం. యోగా శరీరాన్ని, ఆత్మను ఏకీకృతం చేస్తుంది. సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుంది.
ముఖ్యమంటున్నారు యోగా నిపుణులు. పద్మాసనం ఏకాగ్రతను పెంచి శృంగార ప్రక్రియకు ఉసిగొల్పుతుంది.
* యోగాతో ఆరోగ్యంగావుంటూ సెక్స్ జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించవచ్చు
* శరీరంలో ఏదైనా లోపం కలిగి, అశాంతిగావుంటే మనిషి ప్రగతిని సాధించలేడు. శరీరం సహకరిస్తే ఎవరైనా ఎలాంటి పనైనాకూడా తక్షణమే చేయగలరు. యోగా అనేది మీకు మీ భాగస్వామికి మంచి దివ్యౌషధంలాంటిది.
* ధనురాసన, వజ్రాసన, సర్వాంగాసనం, హలాసనం, సూర్యనమస్కారం వంటి యోగాసనాలతో సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
* సెక్స్ సమస్యలు స్త్రీ పురుషుల్లో విభిన్నంగా ఉంటాయి. అందువల్ల ఇద్దరూ యోగా ఆసనాలు వేయాల్సి ఉంటుంది. ఇందులో ముఖ్యమైనది ప్రాణాయమం. దీనివల్ల శరీరం, మనసు నియంత్రణలో ఉండటమే కాకుండా కావలసినంత సెక్స్ సామర్థ్యం వస్తుంది.
ఇలా మీరు యోగాతో సెక్స్ సామర్థ్యం పెంచుకోండి. అయితే ఒక్క షరతును గమనించాలి. ఈ ఆసనాలను నిపుణులైన వారి ఆధ్వర్యంలో చేయాల్సి ఉంటుందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి.
share this
No comments:
Post a Comment