ఈ కలియుగంలో రోజు రోజుకు బంధాలు-అనుబంధాలు మంటగలిసిపోతున్నాయనడానికి ఈ సంఘటన నిదర్శనంగా
నిలుస్తుంది. మహారాష్ట్రలోని పల్ఘర్ జిల్లాలో సభ్య సమాజం తలదించుకునే
దారుణ సంఘటన వెలుగుచూసింది. పెళ్లయి పట్టుమని నెలకూడా కాలేదు. భార్యను ఓ
నీచుడు తన బావకు బహుమతిగా ఇచ్చాడు. తన భార్యను వాడుకోమని బావకు
చెప్పాడు. ఈ నెల 7వ తేదీన మహారాష్ర్టలోని పల్ఘర్ జిల్లాలోని బొయ్సర్
గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 22 ఏళ్ల యువతితో వివాహమైంది. భార్యతో కలిసి
ఉంటున్న అతనికి ఇంటికి అక్కాబావ వచ్చారు.
భర్త ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై అతని బావ
అత్యాచారానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ఆ యువతి ప్రతిఘటించి అతనిని
హెచ్చరించింది. అతడి భారీ నుంచి ఎలాగోలా తప్పించుకుంది. కొద్ది సేపటికి
తన భర్త ఇంటికొచ్చాక జరిగిన విషయాన్ని చెప్పింది. బావకు బుద్ధి
చెప్పాల్సిన ఆమె భర్త అత్యంత నీచానికి దిగజారాడు.
బావను పిలిచి తన భార్యతో గడపమని ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. దీంతో అవకాశం కోసం
ఎదురుచూసిన ఆ మృగాడు ఆమె జీవితాన్ని చిదిమేశాడు. ఆమెపై రేప్ చేశాడు. ఆమె
వరుసకు తనకు చెల్లి అవుతుందన్న విచక్షణ మరిచి మరీ ఆమెపై రేప్
చేశాడు. బాధను దిగమింగుకున్న ఆ వివాహిత మౌల్వి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
చేసింది. జరిగిందంతా పోలీసులకు వివరించింది. పోలీసులు కేసు నమోదు చేసి
నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
share this
No comments:
Post a Comment