Monday, 22 August 2016

త‌న భార్య‌ను బెస్ట్ ఫ్రెండ్‌కు ఇచ్చేశాడుBest friend gave it to his wife

వివాహ బంధం అంటే ఎన్ని కష్టనష్టాలొచ్చినా భార్య‌భ‌ర్త‌లు ఎప్ప‌ట‌కీ క‌లిసి ఉండే బంధం. అయితే ఇలాంటి బంధం ఓ భార్య భ‌ర్త‌ల జీవితంలో అనుకోని మ‌లుపులు తిరిగింది. చైనాకు చెందిన దంపతులు జియాంగ్‌, జుపింగ్‌ కథ వింటే ఎవ‌రి మనసునైనా ద్రవింపచేస్తుంది. చైనాలోని జువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన జియాంగ్‌, జుపింగ్‌లకు 1996లో వివాహమైంది. ఆ తర్వాత వారు ఇద్దరు పిల్లలు పుట్టారు. విధి ఆడిన వింత నాట‌కంలో 2006లో జియాంగ్‌కు జరిగిన భారీ యాక్సిడెంట్‌ వారి తలరాతను మార్చేసింది.
ఆ ప్ర‌మాదంలో జియాంగ్ శ‌రీరం ప‌క్ష‌వాతంతో చ‌చ్చుప‌డిపోయింది. అతనికి నయమవడం కష్టమని వైద్యులు తేల్చేశారు. దీంతో తన భార్య అయినా సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో వేరే పెళ్లి చేసుకోమని ఆమెను బలవంతం చేశాడు జియాంగ్‌. ఆమె దీనికి నిరాకరించింది. దాదాపు ఏడు సంవ‌త్స‌రాల పాటు ఆమెను బ‌తిమిలాడి ఆమెను మ‌రో వివాహానికి ఒప్పించాడు. 2013లో జియాంగ్‌కు విడాకులిచ్చి అతని ప్రాణ స్నేహితుడినే వివాహం చేసుకుంది జుపింగ్‌. అతని ద్వారా ఓ బిడ్డకు తల్లైంది.





అయితే ఆ స్నేహితుడు, జుపింగ్‌లు మాత్రం జియాంగ్‌ను మర్చిపోలేదు. వారిద్దరూ అతనికి సేవలు చేస్తూ అతణ్ని సాధారణ స్థితిలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురు పిల్లలతో కలిసి అందరూ ఒకే ఇంట్లో నివాసం ఉంటున్నారు. మొత్తానికి ఒకరి ఆనందం కోసం మరొకరు ఆరాటపడే ఆ భార్యభర్తల కథ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.





share this

No comments:

Post a Comment