వాంఛ పెంచే మునగ:
ములక్కాడ – దొడ్లో చెట్టుకు విరగ్గాసే ములగ కాడలున్నాయా? బాగా తినేయండి.అవి మీలోని వాంఛను, టెస్టోస్టిరోన్ స్థాయిని పెంచుతాయి. విటమిన్ – ఇ కూడా బాగా ఉంటుంది.ఇది సెక్స్ హార్మోన్లను ఎక్కువ ప్రభావితం చేస్తుంది.స్త్రీ..పురుషులిద్దరి సెక్స్ సామర్ధ్యం పెంచడంలో దివ్యమైన ఔషధంగా పనిచేస్తుంది.
మరికొన్ని..
అంజీర లేదా అత్తిపండు : ఇందులో ఎమినో యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి సెక్స్ సామర్ధ్యాన్ని బాగా పెంచుతాయి.
పచ్చటి తులసి : తులసి ఆకుల రసం వేడినీటిలో కలిపి తాగితే మహిళలలో కామ వాంఛను పెంచడమే కాక, జననాంగ వ్యవస్థను శుద్ధి చేసి సంతానోత్పత్తికి దోహదపడుతుంది.
అరటిపండు : ఇందులో బ్రోమేలైన్ ఎంజైమ్ ఉంటుంది.అది కామవాంఛను ప్రేరేపించే టెస్టోస్టిరోన్ పెంచుతుంది.ఎంతో శక్తినిస్తుంది. పురుషుల రతి సామర్థ్యం పెంపునకు అరటిపండు బాగా పనిచేస్తుంది.ఇందులో ఉండే పొటాషియం, విటమిన్ – బి ని ఇచ్చేరెబోఫ్లావిన్ వంటివి సెక్స్ హార్మోన్ల స్థాయి పెంచుతాయి.
No comments:
Post a Comment