శృంగారం విషయంలో మహిళలు రెచ్చిపోతున్నారని చెప్పాలి.. ఈ విషయాన్ని
పురుషులు కూడా ఒప్పుకోక తప్పదు. శృంగారంలో మహిళలు ఏమాత్రం రాజీపడటం లేదు.
అలాగే, ప్రయోగాలకూ వెనుకాడటం లేదట. తమలో
లైంగిక విజ్ఞానాన్ని పెంచుకునేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఫలితంగా
శృంగారంలో పురుషుల కంటే రెచ్చిపోతున్నట్టు తాజాగా బ్రిటన్‌లో నిర్వహించిన
ఒక సర్వేలో వెల్లడైంది. ఈ సర్వే ద్వారా బ్రిటన్‌లో ఓ ఆసక్తికర అంశం కూడా
వెలుగు చూసింది.
బ్రిటన్‌లో మహిళా స్వలింగ సంపర్కుల సంఖ్య దశాబ్ద కాలంలో నాలుగింతలు
పెరిగినట్టు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గే సంఖ్యలో పెద్దగా
మార్పు లేనప్పటికీ మహిళా సంపర్కులు సంఖ్యలో భారీ మార్పులు చోటు
చేసుకుంటున్నాయని లైంగిక ప్రవర్తన, జీవన శైలిపై జరిపిన జాతీయ సర్వేలో
వెల్లడైంది. దీనికి ప్రధాన కారణం శృంగారం విషయంలో మహిళలు సాహసోపేతంగా
వ్యవహరిస్తున్నారని, ప్రయోగాలకు వెనుకాడటం లేదని ఈ సర్వే తెలిపింది.
లైంగిక విజ్ఞానంపై వారికి అవగాహన ఎక్కువగానే ఉందని కూడా వెల్లడించింది.
ఫలితంగా 1990లో లెస్బియన్లు 4 శాతం మంది ఉండగా 2010 నాటికి వీరి సంఖ్య 16
శాతానికి చేరుకుందని తెలిపింది. పురుష సంపర్కుల సంఖ్య ఒక శాతం పెరిగిందని ఈ
సర్వే వెల్లడించింది. ఈ గణాంకాలు చూస్తే పురుషులు కంటే మహిళలే సెక్స్‌లో
ఎక్కువ ఇంట్రస్టు చూపుతున్నారని అర్ధమవుతుంది.
share this
No comments:
Post a Comment