Tuesday, 30 August 2016

గర్ల్స్ పోకిరీలనే ఎందుకు ప్రేమిస్తారు ?Girls pokirilane loved Why?

వి ల‌వ్ బ్యాడ్ బాయ్స్‌… ఇదీ ఇవాళ అమ్మాయిల తీరు.
పోకిరీలంటే మ‌గువ‌ల‌కు ఇష్టం. ప‌ద్ధ‌తిగా ప్ర‌వ‌ర్తించే వారి క‌న్నా!
విడ్డూరం.. అన్యాయం అని మీకు అనిపించ‌వ‌చ్చు గాక ! కానీ ఇదే నిజం.
నూరుపైస‌ల నిజం. అక్ష‌రాలా.. ల‌క్ష‌ణాల ఇదే నిజం. ఈ నిజాన్ని నిర్థార‌ణ చేసే ప‌నిలో ప‌డాలంటే..
మీరూ ఆ ..త‌ర‌హా మ‌గాళ్ల‌పై శ్ర‌ద్ధ‌పెడితే చాలు.కావాల్సినంత వివ‌రం దొరుకును.
ఎందుక‌ని బ్యాడ్ నే అమ్మాయి గుడ్ అనుకుంటుందో అర్థం అగును. అంత‌క‌న్నా ముందు ఇప్పుడీ క‌థ‌నం చ‌ద‌వండి.






ఎందుకో ఏమో..?
వియ్ ఆర్ బ్యాడ్ బాయ్స్ అంటూ ఊదరగొట్టి తిరుగుతున్నా కొంతమంది అమ్మాయిలకువారిపైనే ఎక్కువ మక్కువ! బ్యాడ్ బాయ్స్ అంటేనే వారికి తెగ ఇష్టం. వాడు చెడ్డకు చెరగని చిరునామా అని హెచ్చరించినా వినకుండా వాళ్లనే లవ్ చేస్తారు! వారి వెంటే ప‌డ‌తారు. పూరి జ‌గ‌న్నాథ్ తీసే సినిమాల్లోనే కాదు బయట కూడా ఇటుంవ‌టి సన్నివేశాలే తార‌స‌ప‌డుతున్నాయ్‌. ఇంతకూ వద్దన్నా వినకుండా బ్యాడ్ బాయ్స్ వైపే మొగ్గుచూపేందుకు కార‌ణ‌మేవిట‌ట‌? బ్యాడ్‌బాయ్స్ దగ్గర అమ్మాయిలకు నచ్చే కొన్ని క్వాలిటీస్ ఏంటట‌?
దే ఆర్ స‌మ్‌థింగ్ డిఫ‌రెంట్
ఈ విష‌య‌మై దాదాపు 1000 మంది హెటిరో సెక్సువల్ స్త్రీ – పురుషులపై ఇటీవ‌ల ఓ అధ్య‌య‌నం జ‌రిగింది. ఈ స్టడీ ప్రకారం.. బ్యాడ్ బాయ్స్ లక్షణాలున్న వాళ్లు.. రొమాంటిక్ జీవితాన్ని తెగ ఎంజాయ్ చేస్తారు. అంటే భాగస్వామితో సుఖజీవితాన్ని పంచుకోవడంలో దిట్ట అన్నమాట! అదీకాక.. వీళ్లకు విశాల దృక్పథం ఉంటుందట! సాధారణ వ్యక్తుల కంటే బ్యాడ్‌బాయ్స్‌లో ఆకర్షించే.. ఆస్వాదించే స్వభావం ఎక్కువగా ఉంటుంది.



ఇంకా వీళ్లలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగానే ఉంటాయ‌ట‌! ఆలోచనా దృష్టికోణం.. అవసరాలకు డబ్బు సంపాదించే మొండితనం పుష్కలంగా ఉండటంతో పిల్లల భవిష్యత్ సేఫ్‌గా ఉంటుంద‌ట‌! ఇంకా ప్రతిదాన్నీ సీరియస్‌గా తీసుకునే గుణం బ్యాడ్‌బాయ్స్ సొంతమట! పైకి మొరటుగా.. మొండిగా.. ఏదో వ్యాధి సోకినట్టు కనిపించే బ్యాడ్‌బాయ్స్ లోపల ఇన్ని రకాల క్వాలిటీస్ ఉండటం వల్లనే అమ్మాయిలు వారిపై ప్రేమను కనబరుస్తారని.. ఎడ‌తెగ‌ని ఇష్టం పెంచుకుంటున్నార‌ని ఈ అధ్యయనంలో తేలింది!

No comments:

Post a Comment