Wednesday, 31 August 2016

భారత్ లో 14ఏళ్ళకే సెక్స్ అనుభవంSex experience in India, aged 14

పోర్న్ పై వార్న్‌.. దేశానంత‌టినీ క‌దిపి కుదిపేసిన వార్త ఇది. వార్త కాదు ఓ ర‌కంగా వార్ అయి కూర్చొంది.అదేదో కూర్చొన్న కొమ్మ‌ను న‌రికేన‌ట్లు.. విష‌మిచ్చి.. అమృతం అని చెప్పిన‌ట్లు.. తెగ జ‌నం ఫీలైపోయారు.రామూలాంటి కొంద‌రు యథావిధిగా క‌ర్త‌వ్యం పాటించేసి, మీడియాకు త‌మ‌దైన సందేశాలు పంపారు.ఔను!




 పాప‌మే పోర్న్‌ను నిషేధించ‌డం పాప‌మే! కానీ దీనిని నిషేధించినా / నిషేధించ‌కున్నా.. బ్యాన్ అన్న‌ది బ్యాన‌ర్ వార్త అయినా / కాకున్నా ఇప్పుడీ దేశంలో 14 ఏళ్ల వ‌య‌సుకే శృంగారానికి అల‌వాటుప‌డుతున్నారు అబ్బాయిలు. 16 ఏళ్ల వ‌య‌సుకే ప‌డ‌క సుఖం పొందేస్తున్నారు అమ్మాయిలు.తెలిసి చేస్తున్నారో / తెలియ‌క చేస్తున్నారో కానీ.. ఇది నూరుపైస‌ల నిజం అని చెబుతోంది ప్ర‌ముఖ మీడియా టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇటీవ‌ల ఆ.. సంస్థ ప్ర‌చురించిన ఓ స‌ర్వే నివేదికలో ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగుచూశాయి.







అవేంటంటే… : –
ఇండియాలోని ప్రధాన నగరాల్లో తొలి లైంగిక అనుభవం పొందిన అబ్బాయిల సగటు వయస్సు 14ఏళ్ళు ఉండగా.. అమ్మాయిల వయస్సు 16 ఏళ్లుగా ఉంద‌ని, దాదాపు 20నగరాల్లో 13 నుంచి 19ఏళ్ళ మధ్య వయస్సున్న 15వేలమంది టీనేజర్లను ఇంటర్వ్యూ చేసినప్పుడు.. 8.9 శాతం మంది లైంగిక వ్యాధుల‌కు గుర‌య్యార‌ని తేలింద‌ని స‌ర్వే రిజ‌ల్ట్ పేర్కొంది.6.3శాతం మంది అబ్బాయిలు, 1.3శాతం మంది అమ్మాయిలు ఫస్ట్ సెక్స్ ఎక్స్‌పీరియన్స్ పొందారని సర్వేలో స్ప‌ష్ట‌మైంది.
యా.. ఇండియా ఈజ్ షైనింగ్ నౌ.. : ఎనీ


డౌట్స్
ఢిల్లీలోని మెడి ఏంజిల్స్.డాట్‌కామ్ అనే హెల్త్‌కేర్ కంపెనీకి చెందిన డాక్టర్ ఇదే విషయాన్నిధ్రువీక‌రించారు. పట్టణ ప్రాంతంలోని వారు యుక్త వయస్సు వచ్చీ రాకముందే సెక్స్ అనుభవం పొందుతున్నారని, ఐతే..సరైన సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడంతో లైంగిక వ్యాధులతో కొంద‌రు బాధపడుతున్నారని స‌ర్వే ద్వారా తెలుస్తోంది. ఆ..మధ్య మహారాష్ట్ర‌లో ఓ యుక్త వ‌య‌సులో ఉన్న గిరిజన బాలిక తనపై రెండుసార్లు అత్యాచారం జరిగినట్టు సెక్స్ ఎడ్యుకేషన్ ద్వారానే తెలుసుకోగలిగిన విషయం ఇక్క‌డ ప్ర‌స్తావ‌నార్హం.









పీఎస్ :- భార‌త్ నిజంగానేవెలిగిపోతోంది.అత్యాచారంలోనూ / విచ్చ‌ల‌విడి శృంగారంలోనూ / మ‌హిళ‌లు పొగ తాగ‌డంలోనూ / డ‌్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లోనూ.. ఇంకా.. ఎన్నింటిలోనో.. వ‌హ్ వా.. వారెవ్వా.! అనేందుకు ఇదొక్క‌టే తార్కాణం. మ‌రి! పోర్న్‌సైట్స్‌ను నిషేధించి లాభం ఏముంద‌ని? అందుకే.. మ‌న పాల‌కులు ముందుచూపుతో.. నిషేధం ఎత్తివేసి త‌మ గొప్ప‌ద‌నం చాటుకున్నారు.అదీ ఫోర్‌సైట్ అంటే ఇలానే ఉంటాలి. దీనిని ప్ర‌శ్నించిన‌నందుకు ఫోర్త్ ఎస్టేట్‌ను ఆడిపోసుకోరు క‌దూ! అన‌రాని మాట‌లు అన‌రూ క‌దూ!


share this


No comments:

Post a Comment