Tuesday, 30 August 2016

ఆ..స‌మ‌యంలో..చీక‌టే ఉండాల‌ట‌!that time night is super for...

మీరు సెక్స్‌ చేసేటపుడు లైట్లు ఆపేయండి. అది వాతావరణానికి, మీకు ఎంతో మంచిది’.. ఇదీ జర్మనీ వాతావరణ శాఖ మంత్రి బార్బరా హెన్రిక్స్‌ సూచన.ఈ సూచనను ఆమె కేవలం మాటలతో మాత్రమే అందించలేదు.. ఓ ఘాటైన షార్ట్‌ఫిల్మ్‌ తీసి వీడియో యాడ్‌గా ప్రచారం చేస్తున్నారు కూడా..! ఆ..యాడ్‌లో ఓ యువతి అర్ధరాత్రి సమయంలో ఇంటికి వస్తుంది.



మెల్లిగా మెయిన్‌డోర్‌ తీసుకుని లివింగ్‌ రూమ్‌కు వస్తుంది. అయితే ఆ సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు లైట్లు వేసుకుని సెక్స్‌ను ఎంజాయ్‌ చేస్తుంటారు. ఆ సీన్‌ చూసిన ఆ యువతి మొదట షాక్‌ అవుతుంది. తర్వాత మెల్లిగా లైట్‌ ఆఫ్‌ చేసి అక్కడ నుంచి బయటపడుతుంది. ‘






ఈ ప్రపంచంలో అందరూ అనవసర సమయాల్లో లైట్లు ఆర్పేస్తే పొదుపయ్యే విద్యుత్‌.. ఓ కోల్‌ పవర్‌ ప్లాంట్ ఉత్ప‌త్తి చేసే ప‌వ‌ర్ కు సమానం’అని ఆ వీడియో ఎండ్‌ అవుతుంది.ఇదంతా సెక్స్‌ కోసం చేసిన ప్రచారం కాదండీ బాబూ. విద్యుత్‌ పొదపు కోసం చేసిన యాడ్‌. దేన్నైనా శృంగారంతో లింక్‌ చేసి చెబితే జనాలకు బాగా ఎక్కుతుందని జర్మనీ మంత్రివర్యులు ఈ ట్రిక్‌ ప్లే చేశారు. మొత్తానికి ఆ..మంత్రిగారి ఐడియా అదిరింది కదూ!

No comments:

Post a Comment