Saturday, 13 August 2016

నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవటంలో బార్లీ వాటర్ ను ప్రయత్నించండి...weight loss tips-how to decreasing waist

ఆహార ప్రణాళికలలో మార్పు మరియు వ్యాయామాలను పాటించటం- ఇవి రెండు మాత్రమే శరీర బరువు తగ్గించవు. మీ నడుము చుట్టూ ఉండే కొవ్వును తగ్గించుకోవటంలో విఫలమైతే బార్లీ వాటర్ ను ప్రయత్నించండి.
బార్లీ ఫైబర్ లను అధికంగా కలిగి ఉండే ధాన్యాలు, రైస్ కు బదులుగా వీటిని తీసుకోవచ్చు. బరువు తగ్గించే విషయానికి వస్తే, బార్లీ కుడా బరువు తగ్గించుటకు సహాయపడే, ఓట్స్, హోల్ గ్రైన్స్ మరియు హోల్ వీట్ ల పట్టికలో చేరుతుంది.
బార్లీ బరువు తగ్గించుకోటానికి ఎలా సహాయపడుతుంది?
కేలోరీల లెక్కింపు
బార్లీ వాటర్ ను పచ్చి బార్లీ గింజల (ఒక కప్పు 200 గ్రాముల ధాన్యాలు) నుండి తయారు చేస్తారు. దాదాపు ఇవి 600 నుండి 750 కేలోరీలను కలిగి ఉంటాయి. ఈ కెలోరీలు దాదాపు 200 నిమిషాల చురుకైన వాకింగ్ ద్వారా కరిగించబడతాయి.
శరీర బరువు తగ్గించే మరొక ఔషదంగా బార్లీ వాటర్ ను పరిగణిచవచ్చు. చాలా వరకు కెలోరీలు సంక్లిష్ట కార్బోహైడ్రేట్ల నుండి అందించబడతాయి. కావున, శరీర బరువు తగ్గించే ఔషదంగా బార్లీని పరిగణించవచ్చు.
ఫైబర్
బార్లీ అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉంటుంది, ఇవి ఎక్కువ సమయం పాటూ పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేస్తాయి. ఆకలిని క్రమంగా చెక్ చేపించుకోవటం వలన మీ బరువు తగ్గించే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని చెప్పవచ్చు. కేలోరీలతో నిండి ఉన్న స్నాక్స్ కు బదులుగా బార్లీ నీటిని తాగటం వలన ఆరోగ్యం పెరగటమే కాకుండా, పొట్ట నుండి నట్టుగా అనిపిస్తుంది.
సున్నితమైన పేగు కదలికలు
ఫైబర్ మరియు తక్కువ కేలోరీలను కలిగి ఉండే బార్లీ వాటర్ పేగు కదలికలను సవరిస్తూ ఉంటాయి. వీటిలో ఉండే ఫైబర్ మీ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచటమే కాకుండా, శరీరాన్ని డిటాక్సిఫికేషణ్ చర్యకు గురి చేస్తాయు.
బార్లీ వాటర్ తయారీ విధానం
బార్లీ వాటర్ ను తయారు చేయటానికి, ఒక కప్పు సేంద్రీయ బార్లీ గింజలు, 4 కప్పుల నీరు మరియు ఒక చెంచా నిమ్మరసం అవసరం. ఈ పదార్థాలను పెనం పైన ఉంచి, 10 నుండి 15 నిమిషాల పాటూ నానబెట్టండి. తరువాత పెనం ను వేడి చేయండి, నీరు వేడయ్యే వరకు 20 నుండి 25 నిమిషాల పాటూ మంటను తక్కువలో ఉంచండి. ఇలా వేడి చేసినపుడు పోసిన నీటిలో 3 వ వంతు వరకు మాత్రమే ఉంటుంది. ఇపుడు ఇది చల్లారే వరకు వేచి ఉండండి. అందులో ఉండే ధాన్యాలు ఉడికి, మృదువుగా మారతాయి. శరీర బరువు తగ్గించే బార్లీ వాటర్ సిద్దంగా ఉంది.
ఆరోగ్యం మెరుగుపడుటకు మరియు శరీర బరువు తగ్గించటానికి గానూ, రోజు 4 కప్పుల బార్లీ నీటిని తాగండి.


share this


No comments:

Post a Comment