Monday, 22 August 2016

15డేస్ బాలికపై గ్యాంగ్ రేప్ 15 days gang rape

ఉత్త‌ర భార‌త‌దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాత్యలను నియంత్రించడం సాధ్య‌మ‌వుతుందా అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ల‌లో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, రేప్‌లు జ‌ర‌గ‌ని రోజులు లేవంటే ప‌రిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. మ‌హిళ‌ల‌పై దాడులు నియంత్రించేందుకు ప్రభుత్వం ‘నిర్భయ’ చట్టం అమలు చేసింది. ఈ చట్టం ఎంతగా అమలవుతుందనే విషయం పక్కబెడితే దేశంలో ‘నిర్భయ’లు మాత్రం పెరిగిపోతున్నారు.






తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఓ దారుణ సంఘ‌ట‌న జ‌రిగింది. 15 ఏళ్ళ బాలికను ముగ్గురు కిడ్నాప్ చేసి 15 రోజుల పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ ముగ్గురు కామాంధుల రాక్ష‌స‌క్రీడ‌లో నలిగిపోయిన ఆ బాలిక వారి చెర నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నించి పారిపోతుండ‌గా వారు తుపాకితో కాల్చి నీళ్ళు లేని బావిలో పడేసి వెళ్ళిపోయారు. ముగ్గురు మృగాళ్లు నవంబర్ 22న పశ్చిమ ఢిల్లీలోని 15 ఏళ్ళ బాలికను కిడ్నాప్ చేసి గ్రేటర్ నోయిడాలోని ఓ గ్రామ శివారులో ఫాంహౌస్ లో బంధించారు.
15 రోజుల త‌ర్వాత వారి నుంచి ఓ రాత్రి ఆమె త‌ప్పించుకుని పారిపోతుండ‌గా వారు ఆమెను పిస్టల్ తో కాల్చి నీళ్ళు లేని 30 అడుగుల లోతు ఉన్న బావిలో పడేశారు. ఆమె చనిపోయిందని భావించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ..కోన ఊపిరితో ఉన్న బాలిక మరుసటి రోజు కేకలు వేయడంతో స్థానికులు గమనించి ఆమెను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. బాలిక ఛాతి, పొత్తికడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్ళడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కృష్ణ, మరో ఇద్దరు మైనర్లు తనపై అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది.దీంతో పోలీసులు కామాంధుల కోసం గాలింపు మొదలుపెట్టారు.



share this

No comments:

Post a Comment