పోర్న్ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయో స్పష్టమవుతోంది. అశ్లీల వీడియోలు యువతను అత్యాచారాలకు ప్రేరేపిస్తున్నాయని మంగళూరులోని రెస్క్యూ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఛారిటీ ట్రస్ట్ అనే సంస్థ వెల్లడించింది.
కర్ణాటకలోని సుమారు 8 జిల్లాల్లో గల 183 కాలేజీల్లో మూడున్నర వేలమంది విద్యార్థులను ఈ సంస్థ సర్వే చేసింది. 16 నుంచి 21 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థులతో ఈ సర్వే చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా మంగళవారం మంగుళూరులోని ఓ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ నివేదికను విడుదల చేశారు. నివేదికలో కళ్లు బైర్లు గమ్మే నిజాలు బయటపడ్డాయి. పోర్న్ వీడియోలు చూస్తే రేప్ చేయాలనిపిస్తుందని 76 శాతం మంది విద్యార్థులు చెప్పారు. 83 శాతం మంది విద్యార్థులు అశ్లీల చిత్రాలు – పోర్న్ మెటీరియల్ చూసి లైంగిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది.
* 74 శాతం మంది కుర్రకారు వేశ్యల వద్దకు వెళ్తున్నారని సర్వేలో వెల్లడైంది.
* అబ్బాయిలే గాక అమ్మాయిలు కూడా బూతు వీడియోలు చూస్తున్నారు. టీనేజీ అమ్మాయిల్లో సుమారు 30 శాతం మంది వారంలో సగటున 5 గంటలపాటు పోర్న్ చూస్తున్నారు.
* వారంలో 7 గంటలపాటు పోర్న్ వీడియోలు చూస్తామని చాలా మంది చెప్పారు.
* 30 శాతం మంది.. రేప్ – గ్యాంగ్ రేప్ వీడియోలను చూస్తారని వారంలో ఇలాంటి 19 వీడియోలను తాము చూస్తామని చెప్పారని ఈ నివేదిక తెలిపింది.
* ప్రతి సంవత్సరం లక్షా 70 వేలమంది విద్యార్థులు రేప్ క్లిప్పింగ్స్ చూస్తారని అంచనా.
share this
No comments:
Post a Comment