* దానిమ్మలో విటమిన్ ఎ.సి.ఈ, బి5, ప్లేవ నాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉన్నాయి. ఇవి కణాల విధ్వంసానికి కారణమయ్యే ప్రీరాడికల్స్‌కు వ్యతిరేకంగా పోరాడుతాయి. వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. అల్జీమర్స్, బ్రెస్ట్, స్కిన్ క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటాయి.
* దానిమ్మలో సహజ యాస్పిరిన్ గుణాలు ఉన్నాయి. రక్త సరఫరాను వేగవంతం చేయడంలో దానిమ్మ మెరుగ్గా పనిచేస్తుంది. పావు కప్పు రసం రోజూ తాగితే గుండె భద్రంగా ఉంటుంది.
* ఎముకల ఆరోగ్యానికి దానిమ్మల చాలా మేలు చేస్తుంది. ఆస్టియో ఆర్థరైటిస్‌తో బాధపడే వారికి అత్యంత దివ్యమైన ఔషధం దానిమ్మ.
*వయసు పెరిగిన కొద్దీ ఏర్పడే ముడతలను కూడా నివారిస్తుంది దానిమ్మ రసం. నీళ్ల విరేచనాలతో బాధపడేవారికి ఇది మంచి మందు. అల్సర్లను నివారిస్తాయి. దంతాల చిగుళ్లను బలపరుస్తాయి.
* రుతుస్రావ సమయంలో ఉండే ఇబ్బంది, ఒత్తిడి వంటి సమస్యలకు దానిమ్మ రసం విరుగుడుగా పనిచేస్తుంది. దానిమ్మ రసం అంగస్థంభన సమస్యలను కూడా తొలగిస్తుంది. శృంగార ప్రేరితంగా పనిచేస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
* క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్ర పిండాల సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. దానిమ్మ రసాన్ని శరీరం మీద రాస్తే అలర్జీలు, కీటకాలు కుట్టడం వల్ల వచ్చిన పొక్కులు మానిపోతాయి. దానిమ్మ ఆకులకు నూనె రాసుకుని వాపులు ఉన్న చోట కడితే కాళ్ల వాపులు తగ్గుతాయి.
share this
No comments:
Post a Comment