Wednesday, 31 August 2016

మ‌న అమ్మాయిల‌కు పెళ్లికి ముందే సెక్స్ కావాల‌ట‌!Our girls wanted to have sex before marriage!

దేశంలోని అమ్మాయిలు చాలా ఫాస్ట్‌గా ఉన్నారు. పెళ్లికి ముందే అన్నీ అయితే అనుభవం ఉంటుందని గర్వంగా ఫీల్ కావడం వల్లే కాఫీ షాపులు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాక.. దూర ప్రదేశాల్లో చదువుతూ, ఉద్యోగాలు వెలగబెట్టే అనేక మంది యువతీ యువకులు తమ సహచరులతో సహజీవనం చేయడం ఫ్యాషనైపోయిందని తాజాగా ఓ సర్వేలో తేలింది.


ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ ఓ సర్వే నిర్వహించింది. అందులో దిగ్భ్రమకు గురి చేసే అంశాలు వెలుగు చూశాయి. పెళ్లికి ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అమ్మాయిలు స్వేచ్ఛ పేరుతో… పురుషులు చేస్తే తప్పులేదు, మేము చేస్తే తప్పా అనే వితండవాదంతో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దానికి స్నేహం, ప్రేమ ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం 15-24 ఏళ్ల మధ్య వయసులో ఉన్న అబ్బాయిలను, అమ్మాయిలను ప్రశ్నించారు. వారిలో 15 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తాము శృంగారంలో పాల్గొన్నట్టు వెల్ల‌డైంది. 24 శాతం మంది అమ్మాయిలు పెళ్లికి ముందే శృంగారంలో పాల్గొంటున్నట్టు తేలింది.
అమ్మాయిలతో పోల్చితే అబ్బాయిలు లేటుగా శృంగారంలో పాల్గొంటున్నట్టు సర్వే తెలిపింది. దీంతో పెళ్లికి ముందు శృంగారం సర్వసాధారణమై పోయింది. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని తమిళ నటి ఖష్బూ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. మరో సినీ నటి షెర్లీన్ చోప్రా కూడా.. పెళ్లికి ముందు సెక్స్ తప్పుకాదని, పైగా అనుబంధం పెరుగుతుందని సెలవిచ్చింది. బంధం బలపడడం మాట అటుంచి పెళ్లికి ముందే శృంగారం కారణంగా చాలా మంది యువతులు మోసపోతున్నారు. ఇప్పుడీ కోవ‌కు చెందిన 150 కేసులు రాష్ట్ర మహిళా కమిషన్ వ‌ద్ద న‌మోద‌య్యాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా ఫిర్యాదు చేసేవారు కూడా 20-24 మధ్య వయస్కులు. మోసపోతున్నా మని చెబుతున్న‌వారంతా బాగా చదువుకుని, ఉద్యోగాలు చేసుకునే యువతులే కావ‌డం విశేషం. అయితే ఇవి ధైర్యం చేసి ఫిర్యాదు చేసిన యువతుల సంఖ్య. తాము చేసింది తప్పని తెలుసుకుని భ‌యంతో కొంతమంది, సిగ్గుతో మ‌రికొంతమంది ఫిర్యాదు చేసేందుకు సైతం ముందుకు రావడం లేదన్న‌ది ఓ వాస్త‌వం.




share this


No comments:

Post a Comment