Friday, 2 September 2016

ఆమెతో సెక్స్ చేస్తే…ఒళ్లంతా గుల్ల‌వ్వాల్సిందే If you have sex with her ... telepathy gullavvalsinde

ఓ మ‌నిషికి ఏది ఉన్నా.. లేక‌పోయినా తెలివి ఉంటే చాలు చ‌క్క‌గా బ‌తికేయ‌వ‌చ్చు.. అంటుంటారు పెద్ద‌లు.. అయితే.. తెలివితో పాటు బ‌రితెగింపు కూడా ఉంటే ఇంకెంత ద‌ర్జాగా బ‌త‌కొచ్చు అనేది నిరూపించింది ఓ యువ‌తి. వివ‌రాల్లోకి వెళితే ఆమె పేరు అలెగ్జండ్రా మార్టినెజ్ (19), పెద్దగా చ‌దువుకోలేదు. కానీ భారీగా సంపాదిస్తోంది.. అలాగ‌ని ఆమె ఉద్యోగ‌స్తురాలు కాదు.. బార్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద హోట‌ళ్లే ఆమె ఆఫీసులు.. ప్ర‌తి రోజూ సాయంత్రం అక్క‌డ‌కు వెళ్ల‌డం.. అక్క‌డ బాగా డ‌బ్బున్న మ‌గ‌వాళ్ల‌ను వెతికిప‌ట్టుకోవ‌డం.. ఇదే ఆమె దిన చ‌ర్య.
బార్ల‌లో బాగా డ‌బ్బున్న వ్య‌క్తి క‌న‌బ‌డితే. వారి ముందు సీట్లో కూర్చుని మాట‌లు క‌లుపుతుంది. కైపెక్కించే అందాలతో వారిని బుట్ట‌లో వేసుకుంటుంది. వాళ్ల‌ను సెక్స్‌కు ప్రేరేపిస్తుంది. అనంత‌రం వారితో పాటు అపార్ట్‌మెంట్ల‌కు వెళ్లి వారికి కావాల్సినంత సుఖం ఇస్తుంది. అక్క‌డ వారిని బుట్ట‌లో పెట్టి అందినంత దోచుకుని ఇంటికి వెళ్లిపోతుంది. ఉద‌యం లేచిన త‌రువాత బాధితుల‌కు అస‌లు విష‌యం తెలిసేది.



ఇలా దాదాపు ప‌దుల సంఖ్య‌లో ఆమె బాధితుల నుంచి ఫిర్యాదులు రావ‌డంతో పోలీసులు ఆమెను ప‌క్క‌గా స్కెచ్ వేసి ప‌ట్ట‌కున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె దాదాపు రూ. 2కోట్ల‌కు పైగా ఇలా సంపాదించింద‌ట‌. ఆమె ఇంటిలో ఖ‌రీదైన రిస్ట్ వాచ్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారట‌. ఆమె ఇంట్లో ఉన్న అతి ఖ‌రీదైన రోలెక్స్ వాచ్‌ల విలువ రూ. 40 ల‌క్ష‌లు ఉంటుంద‌ని అంచ‌నా.. పోలీసులు ఆ యువ‌తిని అరెస్టు చేసి జైలుకు త‌ర‌లించారు.


share this

దేహాన్ని పెట్టుబ‌డిగా పెట్టి..తెగ సంపాదిస్తోంది Earn by investing the body putting

కొంత‌మంది యువ‌త సంపాద‌నే ధ్యేయంగా బ‌రి తెగిస్తున్నారు.. హ‌ద్దులు మ‌రిచి ప్ర‌వ‌ర్తిస్తున్నారు.. అనడంలో అతిశ‌యోక్తి లేదేమో.. మారుతున్న కాలాన్ని బ‌ట్టి.. సాంకేతిక ప‌రిజ్ఞానం డబ్బు సంపాదనలో కొత్త దారులు చూపిస్తోంది. ఇంటి దగ్గర నుంచి కాలు కదపకుండానే వేల రూపాయలు సంపాదించుకునే వెసులు బాటు కల్పిస్తోంది. ఇదే మార్గాన్ని ఎంచుకుని అమెరికాకు చెందిన ఓ యువతి తన దేహాన్ని పెట్టుబడిగా పెట్టి డాల‌ర్ల‌కు డాల‌ర్లు సంపాదిస్తోంది. కూతురు భాగోతాన్ని చివ‌ర‌కు త‌ల్లే గుర్తించి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఆ మైన‌ర్ యువ‌తి ఇప్పుడు క‌ట‌క‌టాల‌పాలైంది.
ఈ సంఘ‌ట‌న వివ‌రాల్లోకి వెళితే మిచిగాన్‌కు చెందిన ఓ 15 ఏళ్ల యువతి ‘కిక్‌’ అనే మొబైల్ యాప్‌ ద్వారా కొంత మంది మగవాళ్లకు పరిచయమైంది. వారికి తన నగ్న ఫోటోలు, అసభ్యకర వీడియోలు పంపేది. వాటిని వీక్షించిన వారు ఆమె అకౌంట్‌లో డబ్బులు వేస్తుండేవారు. ఇలా దాదాపు సంవత్సరం నుంచి ఆమె ఈ పని చేస్తోంది. ఈ ప‌ని ద్వారా ఆ యువ‌తి ఇప్పటి వరకు వెయ్యి డాలర్లు అంటే సుమారు రూ.66 వేలు సంపాదించింది. ఈ ఫోటోలు అక్కడి వారి మొబైళ్లలో హల్‌చల్‌ చేశాయి. దీంతో పోలీసుల దృష్టి వీటి మీద పడింది. ఆ ఫోటోలన్నింటిలోనూ ఫేస్‌ కవర్‌ చేసుకున్న ఓ యువతి నగ్న దేహం ఉంది. వీడియోల్లో కూడా ఫేస్‌ కనబడనీయకుండా ఆ యువతి జాగ్రత్త పడింది. అయితే ఆమె మాత్రం కచ్చితంగా మైనరే అని పోలీసులకు తెలిసింది.






దీంతో పోలీసులు ఆ యువతి గురించి వెతకడం మొదలు పెట్టారు. కొన్ని రోజులకు సదరు యువతి తల్లికి ఈ విషయమంతా తెలిసి పోలీసులకు సమాచారమందించింది. దీంతో పోలీసులు ఆ యువతిని అరెస్ట్‌ చేసి కౌన్సెలింగ్‌ సెంటర్‌కు తరలించారు. నిండా చూస్తే 15 సంవ‌త్స‌రాలుగా కూడా లేని ఆ యువ‌తి ఈ కొత్త ఐడియాతో యువ‌త‌కు వ‌లవేసి డ‌బ్బులు సంపాదిస్తుండ‌డంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.
share this



శోభ‌నాన్ని అడ్డుకున్న పోలీసులు The police refused to evangelize

శోభ‌నాన్ని అడ్డుకున్న పోలీసులుపోలీసులు శోభ‌నాన్ని ఎందుకు అడ్డుకున్నార‌ని ఆశ్చ‌ర్య‌పోతున్నారా..ఈ వార్త నిజ‌మే. హెచ్‌ఐవీతో బాధపడుతున్న ఒక వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు. ఆ విషయం తెలిసిన మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పోలీసులు అడ్డుకున్నారు. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం పెనుగొండ మండలం నాగళ్లదిబ్బ గ్రామానికి చెందిన జ‌య‌రామ్‌ వ్యక్తి కొంతకాలంగా హెచ్‌ఐవీతో బాధపడుతున్నాడు.
కొద్ది రోజుల క్రితం అత‌డు గ‌ల్ఫ్ వెళ్లేందుకు టెస్టులు చేయించుకున్నాడు. దీంతో అత‌డికి హెచ్ఐవీ ఉంద‌ని తేలడంతో గ‌ల్ఫ్ వెళ్ల‌డం కుద‌ర్లేదు. అయితే త‌న‌కు హెచ్‌వీ ఉంద‌న్న విష‌యాన్ని దాచిపెట్టిన జ‌య‌రామ్‌ సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఒక యువతిని ఈ నెల 16న వివాహం చేసుకుని 18వ తేదీన(గురువారం)శోభనానికి ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని రాష్ర్ట శిసు సంక్షేమ అధికారుల‌కు ఓ అజ్ఞాత వ్య‌క్తి తెలియ‌జేశాడు. దీంతో వారి స‌మాచారం ప్ర‌కారం మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెనుగొండ పోలీసులకు సమాచారం అందించి వారి సహాయంతో జయరామ్ ఇంటికి వెళ్లి శోభనాన్ని అడ్డుకుని నూతన వధువును కాపాడారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న వధువు బంధువులు అధికారులు, పోలీసులకు కృత జ్ఞతలు తెలిపారు.

share this

ప్రియుడిని ఇరికించ‌బోయి బుక్ అయ్యింది Book lover was irikincaboyi

ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేసిన ఓ యువ‌కుడికి బుద్ధి చెప్పాల‌నుకున్న ఆ యువ‌తి చివ‌రికి తాను ప‌న్నిన ఉచ్చుల్లో తాను చిక్కుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన యువతి (21) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లో ఉంటోంది. ఆమె ప్ర‌కాశం జిల్లాకు చెందిన సాయి అవినాష్ కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అవినాష్ పెళ్లికి నిరాక‌రించ‌డంతో ఆమె నెల క్రితం అతడిపై ఆమె ఎస్సార్‌నగర్ ఠాణా లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అవినాష్‌ 20 రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు.
అవినాష్ బయటకు రావడం ఇష్టంలేని ఆ యువ‌తి అతడిపై లైంగికదాడి కేసు నమోదు చేయాలని తిరిగి ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేసి ఆమెను మెడికల్ పరీక్షలకు పంపేందుకు సిద్ధమయ్యారు. అప్ప‌ట‌కి కూడా ఆ యువ‌తికి త‌న ప్రియుడిపై ప‌గ చ‌ల్లార‌లేదు. అవినాష్‌పై మరింత బలంగా కేసు బనాయించాలని భావించి ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ ప్లాన్ వేసింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన తన స్నేహితులు ఎం.చైతన్య, విక్కీ శర్మలను సంప్రదించింది. ముగ్గురూ కలిసి ఓ పథకం పన్నారు. అందులో భాగంగానే విక్కీ శర్మ కావలికి చెందిన తన స్నే హితుడు అశోక్‌రెడ్డితో ఈనెల 7న పబ్లిక్ ఫోన్ నుంచి సదరు యువతికి కాల్ చేయించి అవి నాష్ అన్నను మాట్లాడుతున్నానని చెప్పించాడు.







అశోక్‌రెడ్డి ఆమెను దుర్భాలాడుతూ అవినాష్‌పై పెట్టిన కేసు విత్‌డ్రా చేసుకోకుంటే చంపేస్తానని బెదిరించారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం సదరు యువతి ఆ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఎస్సార్‌నగర్ ఠాణాలో అవినాష్‌పై మరో కేసు పెట్టింది. అవినాష్‌ను విచారించిన పోలీసులు ఆ ఫోన్ అతడి అన్న చేయలేదని నిర్ధారించారు. ఫోన్‌కాల్ డేటా ప్రకారం విచారణ జరిపి ఆ ఫోన్ చేసింది ఆ మహిళ స్నేహితులు చైతన్య, విక్కీశర్మ, అశోక్‌రెడ్డి అని తేల్చారు. కావలికి వెళ్లి నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. తమను తప్పుదోవ పట్టించిన యువతిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.


share this

ముద్దు పెట్టుకున్నందుకు పదేళ్ల జైలు శిక్ష Sentenced to ten years in prison for having to kiss

వినేందుకే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ! ముద్దుపెట్టుకున్న పాపానికి ప‌దేళ్ల జైలు శిక్ష అంటే ఎవ‌రికైనా వింత‌గానే తోస్తుంది. విడ్డూరంగానే అనిపిస్తోంది.కానీ అక్క‌డ జ‌రిగిందదే..!వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో క్లర్క్‌గా పనిచేసే హరగోపాల్ డిసెంబర్ 2014న పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు


దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్ర‌యించారు.వారి ఫిర్యాదు మేరకు అతడిపై 376, పోక్స్‌యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు ఖాకీలు.విచార‌ణ అనంత‌రం ఒకటో తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్ కేసును విచారించి అతడికి పదేళ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువ‌రించారు.మొత్తానికీ ఘ‌ట‌న భాగ్య‌న‌గ‌రంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.



share this

హైద‌రాబాద్‌లో భ‌క్తురాలిపై పూజారి రేప్‌ Hyderabad lady devotee priest of rape

ఇటీవ‌ల మ‌నం చాలా సంఘ‌ట‌న‌ల్లో భ‌క్తురాళ్ల‌కు మాయ‌మాట‌లు చెప్పి వారిపై అఘాయిత్యాలు చేస్తున్న‌, వారిని లొంగ‌దీసుకుంటున్న దొంగ స్వామీజీల‌ను, పూజారుల‌ను చూశాం. కానీ హైద‌రాబాద్‌లో ఓ గుడి పూజారి ఓ మ‌హిళ‌ను మాయ‌మాట‌ల‌తో ప్ర‌లోభ‌పెట్టి ఆమెపై అత్యాచారం చేయ‌బోయాడు. బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా దౌల్తాబాద్‌కు చెందిన కరణం రాము(26) నారాయణగూడలోని అభిశ్రాయ్ హాస్టల్‌లో నివాసం ఉంటున్నాడు. రాము గ‌త ఐదారు నెల‌లుగా నారాయ‌ణ‌గూడ‌లోని పోలీస్‌స్టేష‌న్‌కు ఎదురుగా ఉంటున్న సాయిబాబా ఆల‌యంలో పూజారిగా విధులు నిర్వ‌హిస్తున్నాడు.
ఈ క్ర‌మంలోనే ఢిల్లీకి చెందిన 45 సంవ‌త్స‌రాల మ‌హిళ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో ఇబ్బందులు ప‌డుతోంది. ఆమె పూజారిగా ఉన్న రాముని క‌లిసి త‌న ఇబ్బందుల‌ను వివ‌రించింది. ఆమెపై క‌న్నేసిన ఆ కామాంధుడు ఆమెను మాయ‌మాట‌ల‌తో ప్ర‌లోభ‌పెట్టాడు. ఆమెను ఓ పూజ చేయాల‌ని న‌మ్మించాడు. దీంతో బుధవారం మధ్యాహ్నాం 12.30గంటల ప్రాంతంలో పసుపు, కుంకుమ తదితర సామాగ్రి తీసుకుని గుడికి రమ్మన్నాడు. వాచ్‌మెన్‌కు ఓ మహిళ వస్తుందనీ, గుడికి తాళాలు వేయోద్దని చెప్పాడు.





కామాంధుడు రాము చెప్పిన‌ట్టుగానే ఆ మ‌హిళ ఆ సామ‌గ్రి తీసుకుని బుధ‌వారం మ‌ధ్యాహ్నానికి అక్క‌డ‌కు వ‌చ్చింది. త‌ర్వాత ఆలయంలోని ఓ రూమ్‌లోకి ఆమెను తీసుకెళ్లి వస్త్రాలు తీయించి శరీరానికి పసుపు, కుంకుమలను పూసి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. దీంతో ఆమె ఆ కామాంధుడి నుంచి త‌ప్పించుకుని ఎదురుగానే ఉన్న పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


share this


కుమార్తెల‌తో వ్య‌భిచారం చేయిస్తున్న త‌ల్లిదండ్రులు Daughters and parents trying to enforce prostitution

దత్త కుమార్తెలతో వ్యభి చారం చేయిస్తున్న దంప‌తులు దుర్మార్గ‌పు చ‌ర్య బ‌ట్ట బ‌య‌లైంది. హైద‌రాబాద్‌లోని బంజ‌రాహిల్స్‌లో జ‌రిగిన ఈ దారుణ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 10కి చెందిన పద్మ, రమేష్‌కు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు చిన్నప్పుడే భ‌ర్త‌ రమేష్‌ గుండెపోటుతో చనిపోయాడు. భార్య పద్మ కల్లుకు బానిసై గోవిందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టు కుంది. కొద్ది కాలానికి ఆమెకు మతిస్థిమితం తప్పడంతో కుమార్తెలను గోవిందు, అతడి భార్య లక్ష్మి పెంచుకుంటున్నారు.
అయితే పెంపుడు కుమార్తెలు కావ‌డంతో వారి విష‌యంలో దుర్మార్గంగా ఆలోచించారు. యుక్త వయస్సు వచ్చాక వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టారు. డబ్బు వసూలు చేస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. వేధింపులు తట్టుకోలేక పెద్ద కుమార్తె వారం రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. గోవిందు బంజారా హిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌ కేసు నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం యువతిని కనిపెట్టి స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎందుకు పారి పోయావని అడగగా… పెంపుడు తల్లిదండ్రులు మాతో వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు గోవిందును అరెస్టు చేసి లక్ష్మిపై కేసు నమోదు చేశారు.

share this