కొంతమంది యువత సంపాదనే ధ్యేయంగా బరి తెగిస్తున్నారు.. హద్దులు
మరిచి ప్రవర్తిస్తున్నారు.. అనడంలో అతిశయోక్తి లేదేమో.. మారుతున్న
కాలాన్ని బట్టి.. సాంకేతిక పరిజ్ఞానం డబ్బు సంపాదనలో
కొత్త దారులు చూపిస్తోంది. ఇంటి దగ్గర నుంచి కాలు కదపకుండానే వేల రూపాయలు
సంపాదించుకునే వెసులు బాటు కల్పిస్తోంది. ఇదే మార్గాన్ని ఎంచుకుని
అమెరికాకు చెందిన ఓ యువతి తన దేహాన్ని పెట్టుబడిగా పెట్టి డాలర్లకు
డాలర్లు సంపాదిస్తోంది. కూతురు భాగోతాన్ని చివరకు తల్లే గుర్తించి
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ మైనర్ యువతి ఇప్పుడు కటకటాలపాలైంది.
ఈ సంఘటన వివరాల్లోకి వెళితే మిచిగాన్‌కు చెందిన ఓ 15 ఏళ్ల యువతి
‘కిక్’ అనే మొబైల్ యాప్ ద్వారా కొంత మంది మగవాళ్లకు పరిచయమైంది. వారికి
తన నగ్న ఫోటోలు, అసభ్యకర వీడియోలు పంపేది. వాటిని వీక్షించిన వారు ఆమె
అకౌంట్‌లో డబ్బులు వేస్తుండేవారు. ఇలా దాదాపు సంవత్సరం నుంచి ఆమె ఈ పని
చేస్తోంది. ఈ పని ద్వారా ఆ యువతి ఇప్పటి వరకు వెయ్యి డాలర్లు అంటే సుమారు
రూ.66 వేలు సంపాదించింది. ఈ ఫోటోలు అక్కడి వారి మొబైళ్లలో హల్‌చల్
చేశాయి. దీంతో పోలీసుల దృష్టి వీటి మీద పడింది. ఆ ఫోటోలన్నింటిలోనూ ఫేస్
కవర్ చేసుకున్న ఓ యువతి నగ్న దేహం ఉంది. వీడియోల్లో కూడా ఫేస్
కనబడనీయకుండా ఆ యువతి జాగ్రత్త పడింది. అయితే ఆమె మాత్రం కచ్చితంగా మైనరే
అని పోలీసులకు తెలిసింది.
దీంతో పోలీసులు ఆ యువతి గురించి వెతకడం మొదలు పెట్టారు. కొన్ని రోజులకు
సదరు యువతి తల్లికి ఈ విషయమంతా తెలిసి పోలీసులకు సమాచారమందించింది. దీంతో
పోలీసులు ఆ యువతిని అరెస్ట్ చేసి కౌన్సెలింగ్ సెంటర్‌కు తరలించారు. నిండా
చూస్తే 15 సంవత్సరాలుగా కూడా లేని ఆ యువతి ఈ కొత్త ఐడియాతో యువతకు
వలవేసి డబ్బులు సంపాదిస్తుండడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు.
share this
No comments:
Post a Comment