అత్యాచారాలకు నిలయంగా మారిన దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం
వెలుగుచూసింది. ఒక ఉపాధ్యాయురాలిపై రెండేళ్లుగా సామూహిక అత్యాచారం
చేస్తున్న నలుగురు కీచకుల బండారం బయటపడింది. ఆ
నలుగురు కీచకులు ఏకంగా రెండు సంవత్సరాల పాటు ఆమెపై కంటిన్యూగా
అత్యాచారం చేస్తున్నారు. ఫరీదాబాద్‌కు చెందిన ఆ టీచర్ చివరకు తీవ్ర
అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు ఫోన్
చేసి చెప్పడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
రంగంలోకి దిగిన పోలీసులు ఈ అకృత్యానికి పాల్పడ్డ ఢిల్లీకి చెందిన ఓ
వ్యాపారి, అతని సోదరులు, మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.విషయం బయటకి
పొక్కితే చంపేస్తామని బెదిరించారని సదరు బాధితురాలు పోలీసులకు తెలిపింది.
ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించి
చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా
ఉందని, కోలుకున్న తర్వాతే ఆమె వాంగ్మూలం తీసుకోవడం సాధ్యమవుతుందని
డాక్టర్లు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
share this
share this
No comments:
Post a Comment