మరి కొద్ది రోజుల్లో ఒలంపిక్స్ కు ఆతిధ్యమివ్వనున్న బ్రెజిల్ దేశంలోని
రియో డి జెనీరో నగరలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన చూస్తే
ప్రపంచవ్యాప్తంగా మహిళలపై మృగాళ్ల అకృత్యాలు ఎలా జరుగుతున్నాయో
అర్థమవుతుంది. మన దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను మించేలా
తలపిస్తున్న ఈ ఘటనలో ఓ 16 ఏళ్ల బాలికపై 33 మంది యువకులు అత్యాచారానికి
పాల్పడ్డారు.
చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బ్రెజిల్ వ్యాప్తంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రియోలోని ఫవేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన 20 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ను కలువడానికి వెస్టర్న్ ఫ్రింజ్ లోని అతని గదికి వెళ్లింది. అయితే ఆమెను ప్రేమించినట్టు నటించిన ఆ బాయ్ ఫ్రెండే ఆమె పాలిట కాలయముడయ్యాడు.
ఆమెకు డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం తన గ్యాంగ్‌ను
అక్కడకు పిలిచాడు. మొత్తం 33 మంది దుండగులు 36 గంటల పాటు ఆ బాలికను
నిర్భందించి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు,
ఫోటోలు ఆన్ లైన్ లో పోస్ట్ చేయడంతో గతవారం జరిగిన ఈ ఘటన వెలుగులోకి
వచ్చింది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు బాలిక బాయ్ ఫ్రెండ్ తో పాటు
మరో నలుగురిని అరెస్ట్ చేశారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స
పొందుతోంది. బ్రెజిల్ దేశవ్యాప్తంగా ఈ ఘటన పెద్ద కలకలం రేపుతోంది.
చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై బ్రెజిల్ వ్యాప్తంగా మహిళా సంఘాలు, సామాజిక కార్యకర్తలు, ప్రతిపక్షాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ సంఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. రియోలోని ఫవేలా ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన 20 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ను కలువడానికి వెస్టర్న్ ఫ్రింజ్ లోని అతని గదికి వెళ్లింది. అయితే ఆమెను ప్రేమించినట్టు నటించిన ఆ బాయ్ ఫ్రెండే ఆమె పాలిట కాలయముడయ్యాడు.
No comments:
Post a Comment