Friday, 2 September 2016

63 ఏళ్ల కామాంధుడిని ప‌ట్టించిన కంప్యూట‌ర్‌ The 63-year-old computer which had kamandhudini

వ్య‌క్తి మ‌ర‌మ్మ‌తు కోసం ఇచ్చిన కంప్యూటర్‌లో ఓ బాలిక న‌గ్న‌దృశ్యాలు క‌నిపించ‌డంతో ఆ కామాంధుడిని పోలీసుల‌కు ప‌ట్టించేలా చేసింది కంప్యూట‌ర్‌. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే.. ఓ వ్య‌క్తి మ‌ర‌మ్మ‌తు కోసం ఇచ్చి వెళ్లిన‌ కంప్యూటర్‌ను టెక్నీషియన్ ఆన్ చేయ‌డంతో కంప్యూటర్ లో ఓ బాలిక నగ్న దృశ్యాలతోపాటు 60 ఏళ్ల వ్యక్తితో శృంగారంలో పాల్గొన్న దృశ్యాలే క‌నిపించాయ‌ట‌. దీంతో అప్రమత్తమైన అతను వెంటనే పోలీసులకు


సమాచారమందించాడు. పోలీసుల కథనం ప్రకారం.. న్యూయార్క్‌లోని ఉత్తర బౌలెవర్డ్‌లోని కంప్యూటర్లు మరమ్మతు చేసే టెక్నీషియన్ వద్దకు ఓ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చి మ‌ర‌మ్మ‌తు చేయాల్సిందిగా చెప్పి ల్యాప్‌టాప్ ఇచ్చివెళ్లిపోయాడు. ఆ తర్వాత టెక్నీషియన్ దానిని రిపేర్ చేసేందుకు ఆన్ చేశాడు. లాప్‌టాప్ స్క్రీన్‌పై ఓ బాలిక నగ్న దృశ్యాల స్లైడ్‌షో మొదలైంది. అంతేకాదు.. వృద్ధుడితో శృంగారంలో పాల్గొన్న దృశ్యాలు కూడా కుప్పలుతెప్పలుగా కనిపించాయి.
ఆ దృశ్యాల‌ను చూసిన‌ టెక్నీషియన్‌కు మతిపోయినంత ప‌న‌వ్వ‌డంతో వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. టెక్నీషియన్ చెప్పిన ఆధారాలతో పోలీసులు క్వీన్స్‌లో నివాసముండే 63 ఏళ్ల మైఖెల్ ముర్రే ఇంటికి వెళ్లి అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో అతను నిజం అంగీకరించాడు. చైల్డ్ పోర్నోగ్రఫీని తాను ఇంటర్నెట్ ద్వారా ఇతరులతో పంచుకోవడం అలవాటని పోలీసులతో చెప్పుకొచ్చాడు. గత ఐదేళ్లుగా తాను ఇదే పనిలో ఉన్నానని చెప్పడంతో అవాక్కవడం పోలీసుల వంతైంది. ఇక అతని కంప్యూటర్‌లో చైల్డ్ ఫోర్నోగ్రఫీకి చెందిన దాదాపు 400 ఫొటోలు ఉన్నట్టు గుర్తించారు. ముర్రే‌కి మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

No comments:

Post a Comment