ఓ మనిషికి ఏది ఉన్నా.. లేకపోయినా తెలివి ఉంటే చాలు చక్కగా
బతికేయవచ్చు.. అంటుంటారు పెద్దలు.. అయితే.. తెలివితో పాటు బరితెగింపు
కూడా ఉంటే ఇంకెంత దర్జాగా బతకొచ్చు
అనేది
నిరూపించింది ఓ యువతి. వివరాల్లోకి వెళితే ఆమె పేరు అలెగ్జండ్రా
మార్టినెజ్ (19), పెద్దగా చదువుకోలేదు. కానీ భారీగా సంపాదిస్తోంది..
అలాగని ఆమె ఉద్యోగస్తురాలు కాదు.. బార్లు, రెస్టారెంట్లు, పెద్ద పెద్ద
హోటళ్లే ఆమె ఆఫీసులు.. ప్రతి రోజూ సాయంత్రం అక్కడకు వెళ్లడం.. అక్కడ
బాగా డబ్బున్న మగవాళ్లను వెతికిపట్టుకోవడం.. ఇదే ఆమె దిన చర్య.
బార్లలో బాగా డబ్బున్న వ్యక్తి కనబడితే. వారి ముందు సీట్లో
కూర్చుని మాటలు కలుపుతుంది. కైపెక్కించే అందాలతో వారిని బుట్టలో
వేసుకుంటుంది. వాళ్లను సెక్స్‌కు ప్రేరేపిస్తుంది. అనంతరం వారితో పాటు
అపార్ట్‌మెంట్లకు వెళ్లి వారికి కావాల్సినంత సుఖం ఇస్తుంది. అక్కడ వారిని
బుట్టలో పెట్టి అందినంత దోచుకుని ఇంటికి వెళ్లిపోతుంది. ఉదయం లేచిన
తరువాత బాధితులకు అసలు విషయం తెలిసేది.
ఇలా దాదాపు పదుల సంఖ్యలో ఆమె
బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఆమెను పక్కగా స్కెచ్ వేసి
పట్టకున్నారు. ఇప్పటి వరకు ఆమె దాదాపు రూ. 2కోట్లకు పైగా ఇలా
సంపాదించిందట. ఆమె ఇంటిలో ఖరీదైన రిస్ట్ వాచ్‌లను కూడా పోలీసులు
స్వాధీనం చేసుకున్నారట. ఆమె ఇంట్లో ఉన్న అతి ఖరీదైన రోలెక్స్ వాచ్‌ల
విలువ రూ. 40 లక్షలు ఉంటుందని అంచనా.. పోలీసులు ఆ యువతిని అరెస్టు
చేసి జైలుకు తరలించారు.
share this
No comments:
Post a Comment