Friday, 2 September 2016

నటి పై ఇంకో నటుడి అత్యాచారం Another star performer on the rape

ప్రముఖ హిందీ సీరియ‌ల్ న‌టుడు యశ్ పండిట్ పై అత్యాచారం కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ టీవీ నటిపై పలుమార్లు అత్యాచారం జరిపినట్టు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. 28 ఏళ్ల నటిపై ఆయన ముంబై జుహూలోని తన నివాసంలో పలుమార్లు అత్యాచారం జరిపి న ట్టు ఇందులో పేర్కొన్నారు.





వివ‌రాల్లోకి వెళ్తే.. హిందీ సీరియళ్లలో ప్రఖ్యాత నటుడిగా పేరొందిన యశ్ పండిట్ సెప్టెంబర్ 13న సెట్ లో ఓ నటిని కలిశాడు. కొంతకాలానికి వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ..తర్వాత అతను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి.. మొదట తన కారులో అసహజ రీతిలో శృంగారానికి పాల్పడ్డాడు. ఆ..తర్వాత తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఇంటికి పిలిచి ఆమెతో లైంగికంగా గడిపాడు. మరోసారి కూడా ఇదేవిధంగా తన ఇంటికి పిలిచి ఆమెతో సెక్స్ చేశాడు. ఆ..తర్వాత ఆమెను దూరం పెట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఫోన్ కాల్స్ తిరస్కరించాడు.
‘ నాతో శారీరకంగా గడిపేందుకే సన్నిహితంగా మెలిగాడు. ఇదేవిధంగా గ‌తంలోనూ చాలామంది అమ్మాయిలతో తనకు లైంగిక సంబంధం ఉందని చెప్పాడు. అపఖ్యాతి పాలవుతామన్న ఉద్దేశంతో వారంతా పోలీసులను ఆశ్రయించి ఉండరు. కానీ.. నేను అతని దుష్టబుద్ధిని బయటపెట్టి.. సరైన గుణపాఠం చెప్పాలని భావిస్తున్నాను’ అని బాధిత నటి మీడియాకు తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న యశ్ పండిట్ ముందస్తు బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు.

No comments:

Post a Comment