Friday, 2 September 2016

పెళ్లికి వ‌చ్చిన స్నేహితురాలిపై రేప్‌ Rape as a friend to come to the wedding

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం చోటు చేసుకుంది. కేర‌ళ‌కు చెందిన ఓ యువ‌తి స్థానికంగా జ‌రిగే త‌న స్నేహితురాలి పెళ్లికి వ‌చ్చింది. ఆమె రైల్వేస్టేష‌న్‌లో దిగ‌గానే ఆమెపై క‌న్నేసిన ముగ్గురు రౌడీ షీటర్లు ఆమెను అపహరించి… నిర్మానుష్య ప్రాంతానికి తరలించి… ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.




 ఆమెపై ఈ ముగ్గురు రౌడీషీట‌ర్లు గ్యాంగ్‌రేప్ చేశాక యువతిని ఆదివారం ఆటోలో రాజమహేంద్రవరంకి తీసుకుని వస్తున్న క్రమంలో సదరు వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ఆటోలో ఉన్న యువ‌తితో పాటు ఆ ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వీరు ఆ వాహనాన్ని ఢీ కొట్టి అక్క‌డే ప‌డిపోగా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించ‌డంతో పోలీసులు అక్క‌డ‌కు చేరుకున్నారు.
యాక్సిడెంట్ జ‌రిగింద‌ని సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ఆ యువ‌తి చెప్పిన మాట‌లు విని షాక్ అయ్యారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అలాగే ముగ్గురు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని… ఆసుపత్రికి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి… విచారణ చేపట్టారు. బాధితురాలు కేరళ రాష్ట్రానికి చెందిన యువతి అని పోలీసులు తెలిపారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో స్నేహితురాలి పెళ్లి నేపథ్యంలో శనివారం రాత్రి రాజమహేంద్రవరం వచ్చింది. అక్కడే మద్యం సేవిస్తున్న ముగ్గురు రౌడీషీటర్లు ఆమెను అపహరించారని పోలీసులు చెప్పారు.

No comments:

Post a Comment