Thursday, 22 September 2016

బీఎస్ ఎన్ఎల్ రిలయెన్స్ జియోకు షాక్ ఇచ్చింది bsnl gives shock to jio

భారత ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ ఎన్ఎల్ రిలయెన్స్ జియోకు షాక్ ఇచ్చింది. నూతన సంవత్సర కానుకగా కొత్త ఆఫర్స్ ప్రకటించింది. జియో మూడు నెలలపాటు ఉచిత వాయిస్, డేటా, ఎస్ ఎమ్ ఎస్ లు ఫ్రీ ఇచ్చింది. అది కూడా 4జీ నెట్ వర్క్ కు మాత్రమే. అయితే బీఎస్ ఎన్ ఎల్ 4జీ తో పాటు 2జీ, 3జీ కస్టమర్లకు జీవితాంతం ఫ్రీగా వాయిస్ కాల్ సర్వీస్ ను అందజేయనుంది. జియె కంటే మెరుగైన సేవలందించడమే కాకుండా అతి తక్కువ ధరకే డేటా, వాయిస్ కాల్ తో పాటు ఫ్రీగా ల్యాండ్ సౌకర్యాన్ని పొందే అవకాశం కల్పించనుందని బీఎస్ ఎన్ ఎల్ సీ అండ్ ఎండీ అనుపమ్ శ్రీ వాస్తవ్ తెలిపారు.
మొదటి విడతలో కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిశా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలలో జనవరి నుంచి జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అమలులోకి తేనుంది. జియో నెల టారిఫ్ 149 కంటే అతి తక్కువ ధరకే ఈ ఆఫర్స్ ను ప్రకటించింది. కానీ బీఎస్ ఎన్ ఎల్ నెలకు రెండు నుంచి నాలుగు రూపాయల మధ్య రిచార్జ్ చేసుకుంటే జీవితాంతం వాయిస్ కాల్ పొందొచ్చు.

No comments:

Post a Comment