Friday, 2 September 2016

వ్య‌భిచారంలో ప‌ట్టుబ‌డ్డ రామ్ సినిమా న‌టి. actress caught in adultery prostitute

సినిమా, టీవీ ఫీల్డ్ అంటేనే గ్లామ‌ర్ ఫీల్డ్. ఈ ఫీల్డ్‌లో ఉన్న‌వారికి తొంద‌ర‌గా పాపులారిటీ వ‌స్తుంది. అందుకు త‌గ్గ‌ట్టే డ‌బ్బు కూడా వ‌స్తుంది. అయితే వీరు ఆ డ‌బ్బుతో సంతృప్తి ప‌డ‌కుండా అక్ర‌మ సంపాద‌న కోసం అడ్డ‌దారులు తొక్కుతారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడిప్పుడే సినిమా ఫీల్డ్‌లో ఛాన్సుల కోసం ప్ర‌య‌త్నిస్తున్న ఓ యువ‌తి సెక్స్ రాకెట్‌లో అడ్డంగా దొరికిపోయింది.





తాజాగా శ్రీకాకుళం ప‌ట్ట‌ణంలోని వ‌న్‌టౌన్‌లో పోలీసులు జ‌రిపిన దాడుల్లో వ‌ర్థ‌మాన సినీన‌టి దొరికిపోయింది. శ్రీకాకుళంలోని వ‌న్‌టౌన్ టీపీఎం స్కూల్ వెన‌క ఉన్న సాయిమౌళి అపార్ట్‌మెంట్‌లో కొద్ది రోజులుగా కొత్త వ్య‌క్తులు వ‌స్తూ పోతూ ఉన్నారు. స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. పోలీసులు జ‌రిపిన ప‌క్కా దాడుల్లో మొత్తం ఐదుగురు దొరికిపోయారు.
వీరిలో ముగ్గురు యువ‌తుల‌తో పాటు ఇద్ద‌రు విటులు కూడా ఉన్నారు. ప‌ట్టుబ‌డ్డ ముగ్గురు యువ‌తుల్లో ఓ యువ‌తి రామ్ స‌ర‌స‌న కొత్త సినిమాలో గెస్ట్ రోల్‌లో న‌టిస్తున్న‌ట్టు తెలిపింది. ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంద‌ని కూడా ఆమె చెప్పింది. అలాగే ప‌లు టీవీ సీరియ‌ల్స్ కూడా తాను న‌టిస్తున్నాన‌ని ఆమె చెప్పిన‌ట్టు స‌మాచారం. రాఖీ పండ‌గ సంద‌ర్భంగా తాను త‌న ఫ్రెండ్ ఇంటికి వ‌చ్చిన‌ట్టు ఆమె తెలిపింది.

No comments:

Post a Comment