Friday, 2 September 2016

బ‌య‌టికొచ్చిన విజ‌య‌శాంతి భ‌ర్త‌ come out vijaya shanti husband

పెళ్లికి ముందు స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు.. పెళ్ల‌వ‌డంతో ఒక్క‌సారిగా ప్రేక్ష‌కుల‌కి దూర‌మైపోతారు. ఇంటి బాధ్య‌త‌లు చూసుకుంటూ చ‌క్క‌గా ఆద‌ర్శ గృహిణులుగా మారిపోతారు. కొంత‌మంది అప్పుడప్పుడూ అక్క‌గానో, అత్త‌గానో త‌ళుక్కుమ‌ని మెరిపిస్తుంటారు. ఏస‌మ‌యంలోనూ వారి ఫ్యామిలీ మెంబ‌ర్లు గానీ, పిల్ల‌లు, భ‌ర్త ఇటువంటి విష‌యాలేమీ బ‌య‌ట‌కు రావు.


ఎప్పుడ‌యినా ఏదైనా ప్రైవేటు కార్య‌క్ర‌మాల‌కు వారి ఫ్యామిలీ హాజ‌ర‌యితే త‌ప్ప వారెవ‌రో అస‌లు ముఖ‌ప‌రిచ‌యం కూడా ఉండ‌దు. సినిమాల నుంచి రాజ‌కీయాల్లోకి అడగు పెట్టిన లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి పెళ్లి చేసుకుందని త‌క్కువ‌మందికే తెలుసు. కానీ ఆమె భ‌ర్త‌ను ఎప్పుడూ ఎవ‌రూ చూసి కూడా ఉండ‌రు. భ‌ర్త గురించి ఆమె ఎప్పుడూ చెప్ప‌లేదు కూడా! ఇప్పుడు వీరిద్ద‌రికీ సంబంధించిన ఓ ఫొటో ఇప్పుడు సోష‌ల్‌ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.
Actress-Vijayashanthi-husband-M.-V.-Srinivas-Prasad
విజ‌య‌శాంతి సినిమాల్లో స్టార్‌గా ఉన్న స‌మ‌యంలోనే చిర‌కాలంగా తెలిసిన శ్రీ‌నివాస్ ప్ర‌సాద్ అనే వ్య‌క్తిని విజ‌య‌శాంతి పెళ్లిచేసుకుంద‌ని, ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండానే వీరి పెళ్లి జ‌రిగింద‌ని చెబుతారు. ఈ వివాహానికి సినిమా రంగంలోని అతి కొద్ది మంది మాత్ర‌మే హాజ‌ర‌య్యార‌ని స‌మ‌చారం.



 2014లో మెదక్ స్థానానికి అఫిడ‌విట్ దాఖ‌లు చేసే స‌మ‌యంలోనూ ఆమె భ‌ర్త‌ గురించి ప్ర‌స్తావించారు. త‌న భర్త‌పేర సుమారు 28 కోట్ల విలువైన ఆస్తుల‌తోపాటు, హైద‌రాబాద్‌లో 36 ల‌క్ష‌ల విలువైన స్థ‌లం, మెద‌క్‌లోని ప‌టాన్‌చెరులో 70ల‌క్ష‌ల విలువైన ఇంకో స్థ‌లం ఉన్న‌ట్లు ఆమె పేర్కొన్నారు. ఇంకో ముఖ్య విష‌య‌మేంటంటే.. సినీ రంగం నుంచి త‌ప్పుకున్నాక‌.. రాజ‌కీయనాయ‌కురాలిగా విజ‌య‌శాంతి మార‌డానికి కూడా ఆయ‌నే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ట‌.


No comments:

Post a Comment