Friday, 2 September 2016

హీరో కూతురుకు న‌ర‌కం చూపించిన త‌ల్లి The mother of the daughter of the hero is shown to hell

ఓ స్టార్ హీరో కుమార్తె న‌ర‌కం నుంచి బ‌య‌ట‌ప‌డింది. ఆమెకు ఎవ‌రో కాదు త‌న క‌న్న‌ త‌ల్లే న‌ర‌కం చూపించింది. ఏడు సంవ‌త్స‌రాల పాటు చిత్ర వ‌ధ అనుభ‌వించిన ఆమె ఎట్ట‌కేల‌కు ఇప్పుడు త‌న స్నేహితుల సాయంతో ఈ న‌ర‌కం నుంచి త‌ప్పించుకుంది. ముంబయిలోని అంధేరిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ప‌లు బాలీవుడ్ సినిమాల్లో 1990వ ద‌శ‌కంలో స్టార్ హీరోగా న‌టించిన ఓ న‌టుడు చాలా బిజీ బిజీగా ఉండేవాడు. కొద్ది రోజులుగా అత‌డికి అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో తెర‌పై క‌నుమ‌రుగ‌య్యాడు.




ఆ న‌టుడు తన భార్య నుంచి విడిపోయి ఏడు సంవత్సరాలయింది. ఆమెకు అప్పటికే ఇద్దరితో పెళ్లయ్యి వారితో విడిపోయింది. ఈ స్టార్ హీరోను పెళ్లి చేసుకున్న ఆమె అత‌డి నుంచి కూడా విడాకులు తీసుకుని దూరంగా ఉంటోంది. వీరికి 15 సంవ‌త్స‌రాల కుమార్తె ఉంది. తండ్రికి దూరంగా ఉంటున్న కూతుర్ని కంటికి రెప్పగా చూసుకోవాల్సిన త‌ల్లి వివాహేతర సంబంధం కారణంగా అడ్డదారులు తొక్కింది. ఓ వ్యక్తితో సహజీవనం చేస్తూ స్కూల్‌కు పంపాల్సిన త‌న కుమార్తెను దారుణంగా హింసించింది. ప్రియుడి సాయంతో ఆమెకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి దారుణంగా ప్రవర్తించింది. ఈ మత్తు ఇంజెక్షన్ల ప్రభావంతో ఆమె రోజుకు 20 నుంచి 22 గంటలు నిద్రపోయేది.



 దాదాపు ఏడు సంవ‌త్స‌రాలుగా ఆ బాలిక అలాగే న‌ర‌కం అనుభ‌విస్తోంది. ఆ బాలిక‌ను ఆమె అలా హింసించ‌డానికి రీజ‌న్ ఏంటంటే త‌న‌కు రెండో భర్తకు పుట్టిన అబ్బాయిని ఆమె ప్రేమగా చూసుకునేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ దుర్మార్గురాలి తల్లి స్థానికంగా ప‌ట్టున్న బీజేపీ నాయ‌కురాలు కావ‌డంతో ఆమె త‌న‌ను ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేర‌ని ఇంత క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించింది. ఇక ఆమె సినిమాల్లో దర్శకత్వ బాధ్యతలు నెత్తిన వేసుకుని చేతులు కాల్చుకుందని కూడా సమాచారం. ఈ విష‌యం ఎట్ట‌కేల‌కు బ‌య‌ట‌కు రావ‌డంతో స‌ద‌రు స్టార్ హీరో క‌ళ్లు తెర‌చి త‌న కుమార్తెను వెంట తీసుకు వెళ్లి అంధేరి పోలీస్‌స్టేష‌న్లో త‌న మాజీ క‌ర్కశ భార్య‌పై ఫిర్యాదు చేశాడు.


share this



No comments:

Post a Comment