స్నేహితురాలిపై జరుగుతున్న రేప్‌ను లైవ్ ఇచ్చిన ఆ యువతి స్నేహం అనే
పదానికే మాయని మచ్చగా మిగిలింది. అమెరికాలోని ఓహియో రాష్ర్టంలో జరిగిన
ఈ సంఘటన వివరాలు
ఇలా ఉన్నాయి. మరీనా
లోనినా (18), 17 ఏళ్ల టీనేజ్ అమ్మాయి, 29 ఏళ్ల రేమాండ్ గేట్స్ ఒకే వీధిలో
ఉంటూ స్నేహంగా ఉండేవారు.
గత నెల 27న వీరు ముగ్గురు ఒంటరిగా ఉన్నారు. అదే
అదనుగా లోనినా స్నేహితుడు రేమాండ్ తమతో పాటు ఉన్న మైనర్ బాలికపై
అత్యాచారం చేయాలని ప్లాన్ వేశాడు. అయితే ఈ ప్లాన్‌కు లోనినా
సహకరించింది. అంతటితో ఆగకుండా రేమాండ్
అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే, లోనినా ఆ దృశ్యాలను పెరిస్కోప్ సహాయంతో ప్రత్యక్ష ప్రసారం చేసింది.
దీన్ని చూసిన వారి మిత్రుడు ఒకరు పోలీసులకు సమాచారం చేరవేశాడు. దీంతో
లోనినా, గేట్స్ లను అదుపైలోకి తీసుకున్న పోలీసులు వారిపై కేసు పెట్టారు.
వీరిపై అత్యాచారం, కిడ్నాప్, లైంగిక వేధింపులు, మైనర్ బాలికపై కామవాంఛ
తీర్చుకోవడం వంటి సెక్షన్ల కింద కేసు పెట్టగా, ఇద్దరికీ 40 సంవత్సరాల జైలు
శిక్ష పడే అవకాశాలు ఉన్నాయని ఓబ్రియన్ వెల్లడించారు. దీంతో తాను చేసిన
ఘోరమైన పనికి జీవిత చరమాంకం వరకూ లోనినా కటకటాల మధ్యనే గడపాల్సిన
పరిస్థితి.
No comments:
Post a Comment