అది అందుబాటులోనే ఉంటుందా..? నిజంగానే ఈ పిల్ వాడితే వాళ్లకు లైంగిక ఉత్తేజం కలుగుతుందా..? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..ఉండవా..అని మగాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారని సెక్సాలజిస్ట్ ప్రకాష్ కొఠారీ చెబుతున్నారు. తనకు ఇలా ఎన్నో కాల్స్, ఈ-మెయిల్స్ అందాయని ముంబైకి చెందిన ఈ డాక్టర్ తెలిపారు. ఫ్లిబాన్‌సెరిన్ అనే ఫిమేల్ వయాగ్రాను మార్కెట్ చేసుకోవచ్చునని అమెరికాలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇంకేం..ఇండియాలోకి ఇది ఎంటరైంది. మన మార్కెట్‌లో ‘అడీయీ’ పేరిట ఓ ఫార్మసిటికల్ కంపెనీ దీన్ని విడుదల చేసింది.
అనేకమంది.. ముఖ్యంగా పెళ్ళయిన మగవారు దీని గురించి సెక్సాలజిస్టులను ఆరా తీస్తున్నారు. పైగా గూగుల్ సెర్చ్)లో దీనికోసం వెదుకుతున్నవాళ్ళ సంఖ్యా ఎక్కువే! ఆస్ట్రేలియా, అమెరికా తర్వాత ఇండియా నుంచి ఎక్కువమంది ఈ ఫిమేల్ వయాగ్రా గురించి సెర్చ్ చేస్తున్నారట! ఫోన్‌కాల్స్, ఈ-మెయిల్స్ రోజు రోజుకూ వీళ్ళనుంచి పెరిగిపోతున్నాయని ప్రకాష్ కొఠారీ తెలిపారు. దీనికి కారణమేంటని ఆరా తీస్తే మగాళ్ళు లేజీ (బద్దకస్తులు) అని చెన్నైకు చెందిన నారాయణరెడ్డి అనే డాక్టర్ తెలిపారరు. తమ భార్యలు సెక్స్ పట్ల విముఖంగా ఉంటారని, అందుకే ఈ పిల్ గురించి తెలుసుకోదలిచామని కొందరు వ్యక్తులు తనవద్ద మొర పెట్టుకున్నారని చెప్పారు. వీటి గోల ఎలా ఉన్నా..? భార్యాభర్తలు అన్యోన్యంగా ఒకరికొకరు మాట్లాడుకుంటే ఈ సమస్య కాదు ఏ ఇబ్బందీ తలెత్తదు. సాంసారిక జీవితం తప్పక సుఖమయవుతుంది.
No comments:
Post a Comment