ఇవి ముఖసౌందర్యానికి ఉపయోగపడటమే కాక ముఖంపై ఉండే మొటిమల్ని మటుమాయం చేస్తాయి. చర్మ సమస్యల్ని అనుసరించి పెరుగుతో ఫేస్‌ప్యాక్‌ను రూపొందించుకోవచ్చు.
మృదువైన చర్మం కోసం.. : –
ముఖ చర్మం పొడిబారితే పెరుగు ఫేస్‌ప్యాక్ సహాయంతో మృదువుగా, అందంగా తీర్చిదిద్దవచ్చు. ఇందుకోసం పెరుగు ఫేస్‌ప్యాక్‌ను ఇలా తయారు చేసుకోవాలి.
– 2 టేబుల్ స్పూన్స్ పెరుగు
– 1 టేబుల్ స్పూన్ తేనె
– 1 టేబుల్ స్పూన్ అవకాడో మిశ్రమం
– 1 టేబుల్ స్పూన్ వండిన ఓట్‌మీల్
వీటిని మిశ్రమంగా.. చేసుకుంటే పెరుగుఫేస్‌ప్యాక్ రెడీ. దీనిని ముఖానికి రాసుకొన్న పదిహేను నిమిషాల తర్వాత తొలగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
కమిలిన చర్మం పోగొట్టుకునేందుకు.. :-
ముఖంపై చర్మం మండడం, కమిలిపోవటం వంటి వాటికి దిగువ పేర్కొన్న పెరుగు ఫేస్‌ప్యాక్‌తో ఉపశమనం పొందవచ్చు.
– పావు కప్పు పెరుగు
– పావు కప్పు చిన్నగా తరిగిన దోసకాయలు
– 1 టేబుల్ స్పూన్ కలబంద
– 1 టేబుల్ స్పూన్ తేనె
వీటన్నింటినీ కలిపి పేస్టులా చేసుకొని ముఖానికి పట్టించాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడిగేస్తే ఆశించిన రీతిలో .. ఫలితం తప్పక వస్తుంది.
కాంతివంతంగా మెరవాలంటే.. :-
పెరుగులోకి తేనె లేదా నిమ్మరసంను విడివిడిగా కలిపి ఫేస్‌ప్యాక్‌లాగా ముఖానికి పట్టించుకోవాలి. దీనివల్ల ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
సో.. వీటన్నింటినీ ఓ సారి ట్రై చేసి చూడండి. మెరుగైన ఫలితాలు పొందండి. ఆరోగ్యంతో పాటు అందంగానూ ఉండండి. మేని వర్ఛస్సును పెంపొందించుకోండి.
No comments:
Post a Comment