హైదరాబాద్ శివార్లలో రేవ్ పార్టీల జోరు పెరిగింది. ఏదో కుర్రాళ్లు ఈ
రేవ్ పార్టీలో చేసుకోవడం కాదు ఇప్పుడు అంకుల్స్ కూడా అమ్మాయిలను
తెచ్చుకుని మందులో తూలుతూ రేవ్ పార్టీ చేసుకుని
వారితో కలిసి అసభ్యకర డ్యాన్సుల్లో మునిగి తేలారు. నగరు శివారులోని
రంగారెడ్డి జిల్లా నార్సింగ్ పరిధిలోని రవి ఫామ్ హైస్ లో కొందరు అంకుల్స్
కలిసి రేవ్ పార్టీ పెట్టుకున్నారు. కొంతమంది డ్యాన్సర్లను తెచ్చుకొన
అసభ్యంగా డ్యాన్స్ లు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఈ రేవ్‌పార్టీపై దాడి చేసి ఐదుగురు
అమ్మాయిలు.. పదిమంది అంకుల్స్ తో పాటు.. ముగ్గురు నిర్వాహకుల్ని కూడా
అదుపులోకి తీసుకున్నారు. ఈ మధ్యనే జీహెచ్ఎంసీకి చెందిన కొందరు ఉద్యోగులు
సైతం ఇదే తరహాలో రేవ్ పార్టీ చేసుకుంటూ అడ్డంగా బుక్ కావటమే కాదు..
ఉద్యోగాలకు సైతం ఎసరు తెచ్చుకోవటం గమనార్హం. ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్
వంటి రాష్ట్రాలనుంచి అమ్మాయిలను రప్పించి రేవ్ పార్టీలను
నిర్వహిస్తున్నారని, వీరిని అరెస్టు చేసినప్పటికీ బెయిలు మీద బయటపడి తిరిగి
అదే దందా కొనసాగిస్తున్నారని పోలీసులు అంటున్నారు. నిన్నటి వరకు
యువత, మధ్య వయస్కులు రేవ్ పార్టీలో దొరికిపోగా తాజాగా అంకుల్స్ కూడా ఈ
రేవ్‌పార్టీలో ఎంజాయ్ చేసి అడ్డంగా బుక్ అవ్వడం పెద్ద హాట్ టాపిక్
అయ్యింది.
No comments:
Post a Comment