Friday, 2 September 2016

భారీ సెక్స్ రాకెట్‌లో టాప్ హీరోలు, కార్పొరేట్ సెల‌బ్రిటీస్‌ Top heroes in a sex racket, corporate Celebrities


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పోలీసులు ఓ భారీ సెక్స్ రాకెట్‌ను చేధించారు. ముంబైలో జ‌రుగుతున్న ఈ భారీ సెక్స్ రాకెట్ గురించి ప‌క్కాగా స‌మాచారం అందుకున్న పోలీసులు స్కెచ్ వేసి మ‌రీ సెక్స్ రాకెట్‌లో నిందితుల‌ను ప‌ట్టుకున్నారు. పోలీసుల దాడుల్లో పాపులర్ నటులు, మోడల్స్ అరెస్టైన వారిలో ఉన్నారని తెలిసింది. ఈ సెక్స్ రాకెట్ నిర్వాహ‌కులు సోషల్ మీడియా ద్వారా క్లైయింట్‌లను ఆకర్షిస్తున్న‌ట్టు ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.
గోరెగావ్ ప్రాంతంలో ఫిల్మ్‌సిటీకి దగ్గరలో జరుగుతున్న ఈ సెక్స్ రాకెట్‌ గురించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. సెక్స్ రాకెట్ సూత్రధారులుగా భావిస్తున్న శాయ్‌రా, అష్రఫ్ అలియాస్ అమన్‌ను అరెస్ట్ చేశారు. వీరు నేరాన్ని అంగీకరించినట్లు కూడా సమాచారం. విటుల నుంచి 50 వేల రూపాయల నుంచి లక్ష వరకూ వసూలు చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. విటుల్లో ఎక్కువ మంది బిగ్‌షాట్స్ ఉన్నారని సమాచారం. కార్పొరేట్ ప్రపంచానికి చెందినవారే ఎక్కువగా ఉన్నారని తెలిసింది. సావ్‌ధాన్ ఇండియా కార్యక్రమ యాంకర్ కూడా అరెస్టైన వారిలో ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

No comments:

Post a Comment