Saturday, 24 September 2016

ప్ర‌శాంతంగా నిద్ర పోయేందుకు చిన్న చిట్కా Sleep tends to calm the small tip

ప్ర‌తి మ‌నిషి ప్ర‌శాంత‌మైన జీవితం, ఒత్తిడిలేని ఉద్యోగం, వ్యాపారం చేయాల‌నే అనుకుంటారు.. కాని ఈ ఆధునిక ప్ర‌పంచంలో ఇది క‌ష్టం సాధ్యం సంగ‌తి మ‌న‌కు తెలుసు. చాలీ చాల‌ని జీతాలు, ఓవైపు నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌రలు పెరుగుద‌ల‌, పిల్లల ఫీజులు, ఇంట్లోని అవ‌స‌రాలతో మ‌నిషి జీవితం ఉరుకులు..పరుగులతో కూడుకుంటుంది. ఈ బిజీ లైఫ్‌లో ఎన్నో టెన్షన్లతో ఆఫీస్‌కెళ్లిన వ్యక్తి ఏదో ఒక తప్పు చేయడం సహజం.

తప్పుకు బాస్ నుంచి చీవాట్లు త‌ప్ప‌వు.
ఈ ఒత్తిళ్ల‌ను జ‌యించి ప్రశాంతత కోరుకుని నిద్రపోదామంటే నిద్ర ప‌ట్ట‌దు. నిద్ర ప‌ట్టినా హ‌ఠాత్తుగా అర్థరాత్రి మెలకువ వచ్చి ఇబ్బంది పడటం. ఆ తర్వాత నిద్రే ఉండదు. ఈ సమస్యలన్నింటికీ సమాధానం చెప్పే చిట్కా మీ వంటింట్లోనే ఉందని చెబుతున్నారు కొందరు వైద్యులు. అది వెల్లులి (చిన్నుల్లిపాయ). ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనేది నానుడి.

నిద్రలో ప్రశాంతత కరువైతే నరకమే మేలనిపిస్తోంది. ఈ నరకం నుంచి మిమ్మల్ని బయటపడేసేది ఒక్క వెల్లుల్లేనని వైద్యులు చెబుతున్నారు. ఆసియాలోని చాలా దేశాల్లో వెల్లుల్లిని వంటల్లో ఉపయోగిస్తారు. ఇక ఇది ఇప్పుడు ప్ర‌శాంతంగా నిద్ర ప‌ట్టేందుకు కూడా పెద్ద ఔష‌ధంగా మార‌నుంది.


ఈ వెల్లుల్లి ముక్క మెదడులోని కొన్ని భాగాలపై ప్రభావం చూపుతోందట. ఏ ఆలోచన లేకుండా ప్ర‌శాంతంగా నిద్ర‌పోయేలా చేస్తుందట. చాలామంది ఈ టిప్‌ను అనుసరించి ప్రశాంతంగా నిద్రపోతుంటారట. వెల్లుల్లితో ప్ర‌శాంతంగా ఎలా నిద్ర‌పోవాలో …దానిని ఎలా వాడాలో ఈ వీడియోలో చూడండి.

No comments:

Post a Comment