Friday, 2 September 2016

రేప్ చేస్తుంటే లిప్ కిస్ ఇమ్మ‌ని నాలిక కొరికేసింది Kiss Lip give rape are almost korikesindi






దేశం ఏదైనా అమ్మాయిలు ఎదుర్కొనే వేధింపుల్లో ఏ మాత్రం తేడా ఉండటం లేదు. అమ్మాయిల‌పై అత్యాచారాలు అరిక‌ట్టేందుకు ఎన్ని చ‌ట్టాలు వ‌స్తున్నా, ఎన్ని క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేస్తున్నా వేధింపులు మాత్రం ఆగ‌డం లేదు. అయితే తాజాగా ఓ అమ్మాయి త‌న‌ను రేప్ చేసేందుకు ప్ర‌త‌య్నించిన ఓ యువ‌కుడికి షాకింగ్ రిప్లే ఇచ్చింది. ఆ అమ్మాయి అత‌డి రేప్ నుంచి త‌ప్పించుకునేందుకు చేసిన ప్ర‌య‌త్నాన్ని ప్ర‌తి ఒక్క‌రు మెచ్చుకోవాల్సిందే.






దక్షిణ ఫ్రాన్స్‌ లోని టౌలైజ్‌లోని పర్పాన్‌లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా నివాసముండే ఓ పందొమ్మిది సంవత్సరాల యువతి ఇంటికి వెళ్తున్న సమయంలో ఆమెను వేధిస్తూ వెంబడించాడో యువకుడు. ఆమె త‌న అపార్ట్‌మెంట్‌లోకి ప్ర‌వేశించేందుకు లిఫ్ట్ ఎక్కితే ఆ ఆక‌తాయి లిఫ్ట్‌లోకి దూరి తనతో శృంగారంలో పాల్గొనాలని ఆ అమ్మాయిని వేధించాడు. అందుకు యువతి సమ్మతించకపోవటంతో ఆమె జాకెట్‌ను చించివేయడంతోపాటు దుస్తులను లాగి పడేశాడు.









ఆమె కేక‌లు వేసినా స‌మీపంలో ఎవ్వ‌రూ లేరు. దీంతో ఆ యువ‌తి త‌న‌ను తాను ర‌క్షించుకునేందుకు ఓ మాస్ట‌ర్ ప్లాన్ వేసింది. ఆమె ఆ ఆక‌తాయితో లిప్ కిస్ కు ఓకే చెప్పేసింది. ఆమె సై అనడంతో సంతోషంతో లిప్ లాక్ కు సిద్ధమైన యువకుడి నాలికను గబుక్కున పంటితో పట్టుకుని కొరికేసింది. నాలిక తెగి రక్తం కారుతున్నయువకుడు భయపడి అక్కడి నుంచి ప‌రుగు మొదలుపెట్టాడు. ఆ తర్వాత బాధిత యువతి పోలీసులకు జరిగిన విషయం చెప్పింది.





పోలీసులు రంగంలోకి దిగి రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడి నాలిక ముక్కను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రులకు సమాచారం అందించారు.


తెగిన నాలుకతో ఆస్పత్రికి ఎవరైనా వస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. అంతే ఓ ఆస్పత్రికి వచ్చిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి ఘటనా స్థలంలో దొరికిన నాలుక, రక్తంతో డీఎన్ఏ పరీక్ష నిర్వహించి అతడే నిందితుడని నిర్ధారించి అత్యాచారం నేరంపై అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.

No comments:

Post a Comment