మీరు! డేటింగ్ సైట్లు చూస్తూ..కాలం గడుపుతున్నారా? ఆ సైట్లు.. విసిరే వలపు వలలో
చిక్కుకుపోతున్నారా? ఐతే.. రోగాల బారిన పడడం ఖాయమని
హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.ఈ సైట్లు చూడడం వల్ల జేబుకు చిల్లు
పడడం మాట అటుంచితే ప్రాణాంతక వ్యాధుల వ్యాప్తికి ఇవి కారణమవుతాయని ఓ
అధ్యయనం తేల్చింది. పరస్పర అంగీకారంతో శృంగారానికి వీలు కల్పించే ఈ సైట్లు,
తద్వారా హెచ్ఐవీ, ఇతర సుఖవ్యాధుల కారక వైరస్‌లను వ్యాపింపజేస్తున్నాయని
అధ్యయనవేత్తలు చెబుతున్నారు.
నాలుగేళ్ల వ్యవధిలో ఫ్లోరిడాలో హెచ్ఐవీ
కేసుల సంఖ్య 13.5 శాతం పెరుగుదలకు క్రెయిగ్ లిస్ట్ అనే అడల్ట్ డేటింగ్ సైటే
కారణమని పరిశోధనలో నిర్థారణైంది. ఈ సైట్‌లో కలిసిన భాగస్వాముల
ద్వారానే అత్యధికులకు హెచ్ఐవీ సోకినట్టు వెల్లడైంది. సో.. నెటిజనులూ..!
జర జాగ్రత్త,..! పడక సుఖం మాట దేవుడెరుగు.. సుఖ వ్యాధుల బారిన ..
ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడక మిమ్మల్ని మీరు
రక్షించుకునేందుకు సదా అప్రమత్తంగా ఉండండి.
share this
No comments:
Post a Comment