దత్త కుమార్తెలతో వ్యభి చారం చేయిస్తున్న దంపతులు దుర్మార్గపు చర్య
బట్ట బయలైంది. హైదరాబాద్‌లోని బంజరాహిల్స్‌లో జరిగిన ఈ దారుణ సంఘటన
వివరాలు ఇలా ఉన్నాయి. బంజారాహిల్స్ రోడ్డు
నెంబరు 10కి చెందిన పద్మ, రమేష్‌కు ఇద్దరు కుమార్తెలు. పిల్లలు
చిన్నప్పుడే భర్త రమేష్ గుండెపోటుతో చనిపోయాడు. భార్య పద్మ కల్లుకు
బానిసై గోవిందు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టు కుంది. కొద్ది
కాలానికి ఆమెకు మతిస్థిమితం తప్పడంతో కుమార్తెలను గోవిందు, అతడి భార్య
లక్ష్మి పెంచుకుంటున్నారు.
అయితే పెంపుడు కుమార్తెలు కావడంతో వారి విషయంలో దుర్మార్గంగా
ఆలోచించారు. యుక్త వయస్సు వచ్చాక వారిని బలవంతంగా వ్యభిచార కూపంలోకి
నెట్టారు. డబ్బు వసూలు చేస్తూ వారితో వ్యభిచారం చేయిస్తున్నారు. వేధింపులు
తట్టుకోలేక పెద్ద కుమార్తె వారం రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లిపోయింది.
గోవిందు బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్ కేసు
నమోదుచేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. రెండు రోజుల క్రితం యువతిని
కనిపెట్టి స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఎందుకు పారి పోయావని అడగగా… పెంపుడు
తల్లిదండ్రులు మాతో వ్యభిచారం చేయిస్తున్నారని చెప్పింది. ఆమె ఫిర్యాదు
మేరకు గోవిందును అరెస్టు చేసి లక్ష్మిపై కేసు నమోదు చేశారు.
share this
No comments:
Post a Comment