Friday, 2 September 2016

ముద్దు పెట్టుకున్నందుకు పదేళ్ల జైలు శిక్ష Sentenced to ten years in prison for having to kiss

వినేందుకే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ! ముద్దుపెట్టుకున్న పాపానికి ప‌దేళ్ల జైలు శిక్ష అంటే ఎవ‌రికైనా వింత‌గానే తోస్తుంది. విడ్డూరంగానే అనిపిస్తోంది.కానీ అక్క‌డ జ‌రిగిందదే..!వెంగళరావునగర్‌లోని నలంద పాఠశాలలో క్లర్క్‌గా పనిచేసే హరగోపాల్ డిసెంబర్ 2014న పాఠశాలకు చెందిన ఓ విద్యార్థినిని పట్టుకుని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు


దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్ర‌యించారు.వారి ఫిర్యాదు మేరకు అతడిపై 376, పోక్స్‌యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు ఖాకీలు.విచార‌ణ అనంత‌రం ఒకటో తరగతి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి నిందితుడు హరగోపాల్ కేసును విచారించి అతడికి పదేళ్ల జైలుశిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువ‌రించారు.మొత్తానికీ ఘ‌ట‌న భాగ్య‌న‌గ‌రంలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.



share this

No comments:

Post a Comment