Friday, 2 September 2016

జుట్టు తెల్లబడకుండా ఇలా చేయండిHair do tellabadakunda

జుట్టు తెల్లబడటం అనే సమస్య వయస్సు పైబడిన వారికే ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా బాలమెరుపు వచ్చి జుట్టు తెల్లబడితే అది చాలా బాధగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెరుగుతున్న వాతావరణ కాలుష్యం పుణ్య‌మాని ఈ స‌మ‌స్య నానాటికీ తీవ్ర‌త‌ర‌మ‌వుతోంది. అందుకోసం ఈ క్రింది జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌క పాటించండి
1. ఉసిరికాయ ఎండబెట్టి పొడిచేసి ఆ..పొడిని రోజూ ఒక టీ స్పూన్‌ చొప్పున తీసుకుంటే జుట్టు తెల్లబడటం నెమ్మదిగా తగ్గుతుంది.
2. జుట్టు తెల్లబడకుండా అరికట్టే గుణం కరివేపాకులోనూ ఎక్కువ.









3. పుల్లని మజ్జిగలో కరివేపాకు ముద్దగా నూరి తలకు పట్టించి పావుగంట సేపు ఉంచి, గోరువెచ్చని నీటిలో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడంతో మంచి ఫలితం వ‌స్తుంది.
4. కొద్దిపాటి అల్లం తురుములో కాస్తంత తేనే క‌లిపి ఆ..మిశ్రమాన్ని ప్రతిరోజూ ఒక టీస్పూన్‌ చొప్పున తీసుకోండి.
5. తాజా ఉసిరికాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి కొబ్బరి నూనెలో వేసి బాగా మరిగిన తరువాత దానిని దించి, చల్లారిన తరువాత వడకట్టి ఆ..మిశ్రమాన్ని రోజూ నూనెగా రాసుకోండి.







6. మనం తినే ఆహారంలో విటమిన్‌లు, పోషకవిలువల లోపం వల్ల కూడా జుట్టు బలహీన‌మై, తెల్లబ‌డుతుంది.
7. ఐరన్‌, విటమిన్‌-ఎ, విట‌మిన్ – సి, విట‌మిన్ – బి ఉండే ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
8. మాంసకృత్తులు పుష్కలంగా ఉండేే ఆహారాన్ని తింటే జుట్టు సహజమైన మెరుపు సంతరించుకుంటుంది.







9.ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా వెంట్రుకలు తెల్లబడతాయి. క‌నుక వాటిని నియంత్రించుకోవ‌డం ఎంతైనా మంచిది.
10.ఆవుపాల నుంచి వచ్చే వెన్నలో బాలమెరుపును అరికట్టే గుణాలు ఎక్కువ.
11.ఆవు వెన్నను తలకు రాసుకొని ఒక గంట తరువాత కుంకుడుకాయలతో స్నానం చేయండి.
అంతేకాదు నిత్యం ఆహారంలో ఆవు వెన్న‌ను తీసుకుంటే ఎంతో మంచిది.


share this


No comments:

Post a Comment