Friday, 2 September 2016

ప్రియుడిని ఇరికించ‌బోయి బుక్ అయ్యింది Book lover was irikincaboyi

ప్రేమించి పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మోసం చేసిన ఓ యువ‌కుడికి బుద్ధి చెప్పాల‌నుకున్న ఆ యువ‌తి చివ‌రికి తాను ప‌న్నిన ఉచ్చుల్లో తాను చిక్కుకుంది. ఈ సంఘ‌ట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. కడప జిల్లా పులివెందులకు చెందిన యువతి (21) నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తూ అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లో ఉంటోంది. ఆమె ప్ర‌కాశం జిల్లాకు చెందిన సాయి అవినాష్ కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే అవినాష్ పెళ్లికి నిరాక‌రించ‌డంతో ఆమె నెల క్రితం అతడిపై ఆమె ఎస్సార్‌నగర్ ఠాణా లో ఫిర్యాదు చేసింది. ఈ కేసులో అవినాష్‌ 20 రోజులు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యాడు.
అవినాష్ బయటకు రావడం ఇష్టంలేని ఆ యువ‌తి అతడిపై లైంగికదాడి కేసు నమోదు చేయాలని తిరిగి ఎస్సార్‌నగర్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు లైంగికదాడి కేసు నమోదు చేసి ఆమెను మెడికల్ పరీక్షలకు పంపేందుకు సిద్ధమయ్యారు. అప్ప‌ట‌కి కూడా ఆ యువ‌తికి త‌న ప్రియుడిపై ప‌గ చ‌ల్లార‌లేదు. అవినాష్‌పై మరింత బలంగా కేసు బనాయించాలని భావించి ఆమె త‌న స్నేహితుల‌తో క‌లిసి ఓ ప్లాన్ వేసింది. నెల్లూరు జిల్లా కావలికి చెందిన తన స్నేహితులు ఎం.చైతన్య, విక్కీ శర్మలను సంప్రదించింది. ముగ్గురూ కలిసి ఓ పథకం పన్నారు. అందులో భాగంగానే విక్కీ శర్మ కావలికి చెందిన తన స్నే హితుడు అశోక్‌రెడ్డితో ఈనెల 7న పబ్లిక్ ఫోన్ నుంచి సదరు యువతికి కాల్ చేయించి అవి నాష్ అన్నను మాట్లాడుతున్నానని చెప్పించాడు.







అశోక్‌రెడ్డి ఆమెను దుర్భాలాడుతూ అవినాష్‌పై పెట్టిన కేసు విత్‌డ్రా చేసుకోకుంటే చంపేస్తానని బెదిరించారు. ముందే వేసుకున్న పథకం ప్రకారం సదరు యువతి ఆ ఫోన్ కాల్‌ను రికార్డు చేసి ఎస్సార్‌నగర్ ఠాణాలో అవినాష్‌పై మరో కేసు పెట్టింది. అవినాష్‌ను విచారించిన పోలీసులు ఆ ఫోన్ అతడి అన్న చేయలేదని నిర్ధారించారు. ఫోన్‌కాల్ డేటా ప్రకారం విచారణ జరిపి ఆ ఫోన్ చేసింది ఆ మహిళ స్నేహితులు చైతన్య, విక్కీశర్మ, అశోక్‌రెడ్డి అని తేల్చారు. కావలికి వెళ్లి నిందితులు ముగ్గురినీ అరెస్టు చేశారు. తమను తప్పుదోవ పట్టించిన యువతిని త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.


share this

No comments:

Post a Comment